Ivana: అత్తా కోడళ్ల కోణంలో సాగే 'ఎల్.జి.ఎమ్.' .. దూసుకుపోతున్న ట్రైలర్!

LGM Movie Update

  • నిర్మాణ రంగంలోకి క్రికెటర్ ధోని 
  • ఆయన బ్యానర్లోని సినిమాగా 'L.G.M'
  • అత్తాకోడళ్లుగా నదియా - ఇవానా
  • ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్న ట్రైలర్  
  • ఈ జులైలోనే విడుదల

సాధారణంగా కొత్తగా పెళ్లైన తరువాత, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం కోసం ఆ జంటను హనీమూన్ పంపిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఒకరి అభిప్రాయాలు .. అభిరుచుల గురించి ఒకరికి తెలుస్తాయని భావిస్తూ ఉంటారు. నిజానికి కొత్తగా పెళ్లైన అమ్మాయికి, మిగతా కుటుంబ సభ్యులను గురించి కూడా తెలుసుకోవలసిన అవసరం ఉంది.

ముఖ్యంగా ఈ కాలం అమ్మాయిలు పెళ్లికి ముందే అత్తగారిని గురించిన ఒక అవగాహనకి రావాలని కోరుకుంటున్నారు. అలా జరగాలంటే అత్తగారితో కొన్ని రోజుల పాటు ప్రయాణించాలి .. అప్పుడే ఆమె గురించిన అసలు సంగతులు తెలుస్తాయనే ఒక విభిన్నమైన కాన్సెప్టుతో, ఎమ్మెస్ ధోని బ్యానర్లో నిర్మితమైన సినిమానే 'ఎల్.జి. ఎమ్.(లెట్స్ గెట్ మ్యారీడ్) 

హీరోను ప్రేమించిన హీరోయిన్, పెళ్లి తరువాత అత్తగారితో కలిసి ఉండటానికి అభ్యంతరాన్ని తెలియజేస్తుంది. అత్తగారి తత్వం అర్థం కావడానికిగాను ఆమెతో టూర్ ప్లాన్ చేస్తుంది. ఆ ప్రయాణంలో పదనిసలే ఈ సినిమా కథ. ఇదే విషయాన్ని ట్రైలర్ లో చూపించారు. ఇవానా .. నదియా .. హరీశ్ కల్యాణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, రమేశ్ తమిళ్ మణి దర్శకత్వం వహించాడు.

Ivana
Nadhiya
Harish Kalyan
LGM Movie

More Telugu News