Shah Rukh Khan: 'జవాన్' నుంచి నయనతార యాక్షన్ లుక్!

Jawan Movie Update

  • 'జవాన్'గా కనిపించనున్న షారుక్ ఖాన్
  • కీలకమైన పాత్రలో నయనతార 
  • సంగీతాన్ని అందించిన అనిరుధ్ 
  • సెప్టెంబర్ 7వ తేదీన వివిధ భాషల్లో విడుదల

తమిళంలో మాస్ యాక్షన్ సినిమాలతో భారీ హిట్లను అందుకున్న అట్లీ కుమార్, షారుక్ ఖాన్ హీరోగా 'జవాన్' సినిమాను రూపొందించాడు. షారుక్ ఖాన్ సొంత బ్యానర్లో నిర్మితమైన పాన్ ఇండియా సినిమా ఇది. ఆయన ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో, నయనతార ఒక కీలకమైన పాత్రను పోషించింది. 

ఈ సినిమాకి సంబంధించిన ఆమె యాక్షన్ లుక్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఈ మధ్య కాలంలో నయన్ ఇలా యాక్షన్ లుక్ తో కనిపించిన సినిమా ఇదే. ఈ సినిమాలో నయన్ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొందనే విషయం అర్థమైపోతూనే ఉంది. 20 ఏళ్ల కెరియర్లో నయన్ నేరుగా చేసిన బాలీవుడ్ సినిమా ఇది.

ఇక అట్లీ కుమార్ చాలాకాలం పాటు వెయిట్ చేసి మరీ, షారుక్ ను ఒప్పించాడు. 'రాజా రాణి' నుంచి అట్లీ కుమార్ తో ఉన్న సాన్నిహిత్యం వల్లనే నయన్ ఈ సినిమా ఒప్పుకుందని అంటారు. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. సెప్టెంబర్ 7వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

Shah Rukh Khan
Nayanatara
Jawan Movie
  • Loading...

More Telugu News