Roja: పవన్ కల్యాణ్‌కు ఫ్యాన్స్ ఉంటే, జగన్‌కు సోల్జర్స్ ఉన్నారు: రోజా

Will Janasena contest all seats roja asks
  • జనసేనాని తీరు పిచ్చాసుపత్రి నుండి వచ్చినట్లుగా ఉందన్న మంత్రి
  • పవన్! ఇది షూటింగ్ కాదు.. రియాల్టీ అని ఎద్దేవా
  • జనసేన అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టగలదా? అని ప్రశ్న
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి రోజా తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఆమె నంద్యాలలో విలేకరులతో మాట్లాడుతూ... జనసేనాని తీరు పిచ్చాసుపత్రి నుండి వచ్చినట్లుగా ఉందన్నారు. ఆయన చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ కోసమే పని చేస్తున్నారని విమర్శించారు. పవన్ కు ఫ్యాన్స్ ఉంటే వైసీపీకి సోల్జర్స్ ఉన్నారనే విషయాన్ని గుర్తించాలన్నారు. కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేని వ్యక్తి... జగన్ సైన్యం గురించి మాట్లాడటమా? అని ప్రశ్నించారు. జనసేన నుండి కనీసం పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు లేరన్నారు. పవన్ కల్యాణ్.. ! ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి ఇది షూటింగ్ కాదు.. రియాల్టీ అని ఎద్దేవా చేశారు. అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టలేని పార్టీ అన్నారు.

ఇదిలా ఉండగా, కర్నూలు జిల్లా నందికొట్కూరు, పగిడ్యలలో రోజా రెండు ఇండోర్ స్టేడియాలను ప్రారంభించారు. ఇందుకు సంబంధించి ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. 'అశేష జనవాహిని నడుమ కర్నూలు జిల్లా నందికొట్కూరు మరియు పగిడ్యలలో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ద్వారా రూ. 2.80 కోట్ల తో నిర్మించిన రెండు ఇండోర్ స్టేడియంను ప్రారంభించడం జరిగింది. సాప్ చైర్మన్, నందికొట్కూరు నియోజకవర్గం ఇంచార్జి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచ బ్రహ్మానంద రెడ్డి గారితో కలిసి భారీ ర్యాలిలో పాల్గొనడం జరిగింది.

ఈ కార్యక్రమానికి కర్నూలు నుండి ఆశేష జనవాహిని మధ్య భారీ ర్యాలీగా బయలుదేరి నందికొట్కూరు చేరుకుని వైసీపీ అభిమానులు జై జగన్ నినాదాలతో కోలాహలం మధ్య క్రీడా శాఖ వారు 2.80 కోట్ల రూపాయలతో నిర్మించిన ఇండోర్ స్టేడియంను ప్రారంభించడం చాలా సంతోషం కల్గించింది. కార్యక్రమంలో స్వచ్చందంగా స్థానిక ప్రజలు జిల్లా ముఖ్యనాయకులు అధికారులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు' అని ఆమె పేర్కొన్నారు.
Roja
Pawan Kalyan
Janasena
YSRCP

More Telugu News