Virat Kohli: టెస్ట్ క్రికెట్ టాప్ 5 ఎలైట్ లిస్ట్ లో విరాట్ కోహ్లీ

Virat Kohli steps in Test Cricket top 5 elite list

  • వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ లో 76 పరుగులు చేసిన కోహ్లీ
  • టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఐదో భారతీయ బ్యాట్స్ మెన్ గా ఘనత
  • జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ ను వెనక్కి నెట్టేసిన విరాట్

వెస్టిండీస్ తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 141 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసిపోయింది. ఈ మ్యాచ్ లో యువ ఆటగాడు జైస్వాల్ 171 పరుగులు చేసి అరంగేట్రంలోనే అదరగొట్టాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 103 పరుగులతో మరో శతకాన్ని సాధించగా... కోహ్లీ 76 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కోహ్లీ మరో ఘనతను సాధించాడు. టెస్ట్ మాచ్ లలో అత్యధిక పరుగులు చేసిన ఐదవ ఇండియన్ బ్యాట్స్ మెన్ గా అవతరించాడు. ఈ క్రమంలో డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్ ను వెనక్కి నెట్టి టాప్ 5 ఎలైట్ లిస్ట్ లో అడుగుపెట్టాడు. 

కోహ్లీ ఇప్పటి వరకు టెస్టుల్లో 8,555 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ జాబితాలో సెహ్వాగ్ (8,503)ను వెనక్కి నెట్టేశాడు. అత్యధిక పరుగుల జాబితాలో కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్ (15,921), రాహుల్ ద్రావిడ్ (13,265), సునీల్ గవాస్కర్ (10,122), వీవీఎస్ లక్ష్మణ్ (8,781) ఉన్నారు.

Virat Kohli
Test Matches
Elite List
Team India
  • Loading...

More Telugu News