Chandrababu: శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత బీఎస్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన చంద్రబాబు, లోకేశ్
![Chandrababu and Lokesh consoles BS Rao family members](https://imgd.ap7am.com/thumbnail/cr-20230714tn64b1571252406.jpg)
- శ్రీచైతన్య విద్యాసంస్థల వ్యవస్థాపకుడు బీఎస్ రావు కన్నుమూత
- నిన్న గుండెపోటుతో మృతి
- భౌతికకాయం విజయవాడకు తరలింపు
- బీఎస్ రావు భౌతికకాయానికి నివాళులు అర్పించిన చంద్రబాబు, లోకేశ్
శ్రీచైతన్య విద్యాసంస్థల వ్యవస్థాపకుడు డాక్టర్ బీఎస్ రావు నిన్న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. హైదరాబాదులో గుండెపోటుకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియల నేపథ్యంలో ఆయన భౌతికకాయాన్ని విజయవాడ తరలించారు.
కాగా, బీఎస్ రావు భౌతికకాయానికి టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీఎస్ రావు కుటుంబ సభ్యులను చంద్రబాబు, లోకేశ్ పరామర్శించారు. వారికి తమ ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
![](https://img.ap7am.com/froala-uploads/20230714fr64b156fd23e2c.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20230714fr64b157099cf6d.jpg)