Pawan Kalyan: బ్రిటిష్ వారే పారిపోయారు జగన్ ఎంత? అతనికంత సీన్ లేదు: పవన్ కల్యాణ్

Pawan Kalyan hot comments on YS jagan in Tanuku meeting

  • జగన్ గిచ్చాడని మోదీకి ఫిర్యాదు చేస్తే బాగుండదన్న పవన్ 
  • తామే తేల్చుకుంటామని వ్యాఖ్య
  • జగ్గూ గ్యాంగును ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసునన్న పవన్
  • తన కుటుంబం జోలికి వస్తే ఊరుకోనని హెచ్చరిక

ఏపీ సీఎం వైఎస్ జగన్ తనకు శత్రువు కాదని, అతనికి అంత సీన్ లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం నిప్పులు చెరిగారు. గురువారం తణుకు నియోజకవర్గం నాయకులు, వీర మహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ధైర్యంతో పోరాటం చేస్తే బ్రిటిష్ వారే పారిపోయారు.. ఇక జగన్ ఎంత? అన్నారు. ఇదే తనకు ధైర్యం అన్నారు. తన పోరాటం జగన్ పై కాదని, ప్రజా సమస్యలపై అని స్పష్టం చేశారు. జగన్ గిచ్చాడని మోదీకి ఫిర్యాదు చేస్తే బాగుండదని, ఆయన సంగతి తాము ఇక్కడే తేల్చుకుంటామన్నారు. జగ్గూ గ్యాంగ్‌ను ఎలా హ్యాండిల్ చేయాలో తమకు తెలుసునన్నారు.

జగన్ ను జగ్గూభాయ్ అంటారని, ఇప్పుడు ఇక్కడ జగ్గూభాయ్ రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడని ఎద్దేవా చేశారు. తన పోరాటం జగన్‌పై కాదని, ప్రజాస్వామ్యాన్ని పట్టిపీడిస్తున్న జలగలపై అన్నారు. అసలు జగన్ అనేవాడు నాకు ఆనడు అన్నారు. ఈ జగన్ పోతే రేపు మరో జగన్ వస్తాడని, అందుకే తమ పోరాటం సమస్యలపై అన్నారు. జగన్ ఒక రౌడీ పిల్లాడని చురకలు అంటించారు. యువతలో ప్రతిభను వెలికితీయకుండా రూ.100కు పని చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఎంతకాలం పేదవారిని పట్టి పీడిస్తారని నిలదీశారు. తన కుటుంబం జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు.

అసలు వాలంటీర్ వ్యవస్థ అవసరమే లేదని పవన్ అన్నారు. డిగ్రీ చదివిన యువకులను అక్షరాలా కేవలం రూ.165కు పని చేయిస్తున్నారన్నారు. ఒక యువకుడి ఖరీదు ఇంతేనా? అన్నారు. ఇదే తన ప్రశ్న అన్నారు. తాను అయితే ఇదే వాలంటీర్ వ్యవస్థలో ఉన్న యువకుల సామర్థ్యాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తానని, వారిని ఆ రంగాల్లో నిష్ణాతులను చేస్తానన్నారు. కులాలపరంగా ఇలా ప్రతిభను వెలికి తీయవద్దని, సమర్థత పరంగా చూడాలన్నారు.

  • Loading...

More Telugu News