YS Jagan: విద్యారంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టిన ఏపీ సీఎం జగన్!

YS Jagan meeting with education officials

  • విద్యాశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష
  • విద్యారంగంలో టెక్నాలజీని ఉపయోగించాలని జగన్ సూచన
  • మార్పులకు ఇప్పుడే నాంది పలకాలన్న సీఎం

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. పాఠశాల విద్య, ఉన్నత విద్యలో కీలక మార్పులకు అడుగులు వేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు, యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్లతో తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... విద్యారంగంలో టెక్నాలజీని విరివిగా ఉపయోగించాలన్నారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరమన్నారు. మార్పులకు ఇప్పుడే నాంది పలకాలన్నారు. 

ఇందులో భాగంగా విద్యారంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. మన విద్యా విధానం ప్రపంచస్థాయిలో పోటీపడేలా ఉండాలన్నారు. మన ఫ్యాకల్టీ కూడా ఆ స్థాయిలో విద్యను అందించాలని ఆకాంక్షించారు. ఏఐ, వర్చువల్ రియాల్టీ, అగ్మెంటేషన్ రియాల్టీలను బోధనలో ఉపయోగించడంపై ప్రధానంగా చర్చించారు. ఈ సమీక్షకు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ హేమచంద్రారెడ్డి తదితరులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News