AIMIM: ఔరంగాబాద్‌ జిమ్‌లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ కసరత్తులు

AIMIM chief Asaduddin hits gym in Aurangabad

  • నిత్యం బిజీగా ఉండే హైదరాబాద్ ఎంపీ
  • యూసీసీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పర్యటన
  • ఫిట్‌నెస్‌పై శ్రద్ధ తీసుకుంటున్న అసదుద్దీన్

ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నిత్యం బిజీగా ఉంటారు. ప్రజాసేవ, రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు. కేంద్రంలోని అధికార బీజేపీ విధానాలను తూర్పారబడుతుంటారు. ప్రస్తుతం కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని చూస్తున్న ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యూసీసీకి వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారు. ఇందుకు వివిధ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

 ఇంత బిజీలో కూడా ఆయన తనకోసం కొంత సమయం తీసుకున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్న అసదుద్దీన్ ఔరంగాబాద్‌లో జిమ్ కి వెళ్లి కసరత్తులు చేశారు. ఆయన బరువులు ఎత్తుతూ ఎక్సర్ సైజ్ చేస్తున్న వీడియోను ఓ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో షేర్‌‌ చేశారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన ఆరోగ్యం విషయంలో అసదుద్దీన్ శ్రద్ధ తీసుకుంటారు.

AIMIM
Asaduddin Owaisi
gym
Maharashtra
bjp
ucc

More Telugu News