Infosys: ఉద్యోగులకు షాకిచ్చిన ఇన్ఫోసిస్!

Infosys defers salary hike for employees below senior management level

  • జీతాల పెంపును వాయిదా వేసిన ఇన్ఫోసిస్
  • శాలరీ హైక్‌పై ఇప్పటివరకూ ఉద్యోగులకు అందని సమాచారం
  • 2020 తరువాత తొలిసారిగా జీతాలు పెంచేందుకు యాజమాన్యం వెనుకంజ 

ఇన్ఫోసిస్ ఉద్యోగులకు యాజమాన్యం తాజాగా షాకిచ్చింది. ఈసారి జీతాల పెంపు వాయిదా వేసేందుకు నిర్ణయించింది. సంస్థలోని సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయికి దిగువన ఉన్న వారందరికీ ఈసారి జీతాల పెంపు ఉండదని సమాచారం. శాలరీ హైక్‌కు అర్హులైన ఎంతో మందికి ఇప్పటివరకూ సంస్థ నుంచి ఎటువంటి సమాచారం అందలేదని జాతీయ మీడియా పేర్కొంది. 

ప్రతి ఏటా ఏప్రిల్ నుంచి ఇన్ఫోసిస్‌లో జీతాలు పెంపు మొదలవుతుంది. పెంచిన శాలరీ వివరాలను సంస్థ సాధారణంగా జూన్ నెలకే ఉద్యోగులకు తెలియజేస్తుంది. అయితే, పెంపు విషయంలో తమకు ఇప్పటివరకూ అధికారికంగా ఎటువంటి సమాచారం అందలేదని అనేక మంది ఉద్యోగులు చెప్పారు. ఇన్ఫోసిస్‌లో జీతాల పెంపు వాయిదా పడటం 2020 తరువాత ఇదే తొలిసారి. కరోనా సంక్షోభం కారణంగా అప్పట్లో సంస్థ శాలరీ హైక్‌ను వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News