Vijay Devarakonda: 'ఖుషి' నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్!

Khushi Second Single Released

  • 'ఖుషి' సంగీత దర్శకుడిగా హేషం అబ్దుల్ వాహెబ్ 
  • మంచి ఫీల్ తో సాగిన సెకెండ్ సింగిల్ 
  • సెప్టెంబర్ 1వ తేదీన రిలీజ్ కానున్న సినిమా 
  • హీరో .. హీరోయిన్స్ ఇద్దరికీ ఈ సినిమా కీలకమే


విజయ్ దేవరకొండ .. సమంత నాయకా నాయికలుగా 'ఖుషి' సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. ప్రేమకథా చిత్రాలను మంచి ఫీల్ తో తెరకెక్కించగలడనే పేరు శివ నిర్వాణకి ఉంది. తనదైన శైలిలో ఆయన రూపొందించిన ఈ సినిమా, సెప్టెంబర్ 1వ తేదీన విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి సెకెండ్ సింగిల్ గా మరో సాంగును రిలీజ్ చేశారు. 'పదమునీవైపిలా .. పరుగు నీవే కదా, తనువు తెరమీదుగా .. చేరుకో త్వరగా' అంటూ ఈ పాట సాగుతోంది. హేషం అబ్దుల్ వాహెబ్ స్వరపరిచిన ఈ పాటకి శివ నిర్వాణ సాహిత్యాన్ని అందించగా, సిద్ శ్రీరామ్ - చిన్మయి ఆలపించారు. 

బీట్ కొత్తగా ఉంది .. మంచి ఫీల్ వర్కౌట్ అయింది. సినిమాలో పాటకి తగిన విజువల్స్ పడితే, ఈ పాట బ్యూటీ మరింత పెరిగే అవకాశం ఉంది. సచిన్ ఖేడేకర్ .. జయరామ్ .. మురళీ శర్మ .. వెన్నెల కిశోర్ .. లక్ష్మి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమా హిట్ అటు విజయ్ దేవరకొండకి .. ఇటు సమంతకి చాలా అవసరమే.

More Telugu News