Ponguleti Srinivas Reddy: వైఎస్ హయాంలో ఉచిత విద్యుత్ ఘనత కాంగ్రెస్ దే: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti fires on KCR

  • మల్లవరం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద కాంగ్రెస్ ధర్నా
  • ధర్నాలో పాల్గొన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  • రేవంత్ పై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపాటు

ఉచిత విద్యుత్ విషయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను నిరసిస్తూ తల్లాడ మండలం, మల్లవరంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. మల్లవరం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ దళితులు, గిరిజనులు రైతుల పక్షాన ఉంటుందని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉచిత విద్యుత్ ను ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. రేవంత్ పై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

ఉచిత విద్యుత్ ను అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పొంగులేటి విమర్శించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్ దేనని చెప్పారు. కాంగ్రెస్ నేతలు చెప్పిన ప్రతి మాటను బీఆర్ఎస్ నేతలు వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి చెపుతున్న మాటలను ప్రజలు వింటున్నారని... బీఆర్ఎస్ నేతలు చెప్పే మాటలను ఎవరూ వినే పరిస్థితి లేదని అన్నారు.

Ponguleti Srinivas Reddy
Revanth Reddy
Congress
KCR
BRS
  • Loading...

More Telugu News