Pavan Kalyan: ఒక రేంజ్ లో 'బ్రో' బిజినెస్ .. మైత్రీ చేతికి నైజామ్ హక్కులు!

Bro Movie Update

  • పవన్ - సాయితేజ్ ల 'బ్రో'
  • 'వినోదయా సితం'కి రీమేక్ 
  • 30 కోట్లకు నైజామ్ హక్కులు 
  • ఈ నెల 28వ తేదీన సినిమా రిలీజ్

పవన్ అభిమానులందరి దృష్టి ఇప్పుడు 'బ్రో' సినిమాపైనే ఉంది. తమిళంలో క్రితం ఏడాది అక్టోబర్ 13న వచ్చిన 'వినోదయా సితం' సినిమాకి ఇది రీమేక్. తమిళ సినిమాకి దర్శకత్వం వహించిన సముద్రఖనియే తెలుగు రీమేక్ కి కూడా దర్శకుడు. ఈ సినిమాలో పవన్ తో పాటు సాయితేజ్ కూడా కనిపించనున్నాడు.

ఈ సినిమాలోని మెయిన్ పాయింట్ నచ్చడం వల్లనే పవన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. కథాపరంగా ఈ సినిమాకి చాలా తక్కువ మంది ఆర్టిస్టులు మాత్రమే అవసరం. తక్కువ బడ్జెట్ లో .. తక్కువ రోజుల్లో ఈ సినిమాను పూర్తిచేశారు. అలాంటి ఈ సినిమా బిజినెస్, పవన్ కి గల క్రేజ్ కారణంగా ఒక రేంజ్ లో జరుగుతోంది.

ఈ సినిమా నైజామ్ హక్కుల కోసం గట్టిపోటీ ఏర్పడిందని అంటున్నారు. చివరికి మైత్రీ మూవీస్ వారు, తమ సొంత డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా నైజామ్ హక్కులను దక్కించుకున్నట్టుగా చెబుతున్నారు. ఇందుకోసం 30 కోట్లను చెల్లించినట్టుగా టాక్ నడుస్తోంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, ఈ నెల 28వ తేదీన విడుదల చేయనున్నారు.

Pavan Kalyan
Saitej
Bro Movie
  • Loading...

More Telugu News