AP Cabinet Meeting: ఇటు జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్.. అటు మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశాల ప్రారంభం

AP Cabinet meeting started

  • సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఏపీ కేబినెట్ భేటీ
  • పలు అంశాలకు ఆమోదం తెలపనున్న ఏపీ కేబినెట్
  • పార్లమెంటులో ప్రవేశ పెట్టబోయే బిల్లులపై చర్చిస్తున్న కేంద్ర కేబినెట్

ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమయింది. సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఉన్న సమావేశ మందిరంలో ఈ సమావేశం జరుగుతోంది. సమావేశానికి మంత్రులు, కీలక అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలకు సంబంధించిన నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలో పలు పరిశ్రమలకు అనుమతులను ఇవ్వడంతో పాటు భూ కేటాయింపులను కూడా మంత్రివర్గం చేయనుంది. 

మరోవైపు ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమయింది. త్వరలోనే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో... సభలో ప్రవేశపెట్టబోయే బిల్లుల గురించి కేంద్ర మంత్రి వర్గం చర్చిస్తోంది. ఉమ్మడి పౌరస్మృతి వంటి కీలక బిల్లులను ఈ సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే.

AP Cabinet Meeting
Jagan
YSRCP
Narendra Modi
BJP
  • Loading...

More Telugu News