Madhav: హీరోగా ఎంట్రీ ఇస్తున్న రవితేజ తమ్ముడి కొడుకు

- రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా చిత్రం
- నేడు టైటిల్ పోస్టర్ విడుదల చేసిన రవితేజ
- సినిమా పేరు మిస్టర్ ఇడియట్
- పెళ్లిసందD ఫేమ్ గౌరి రోణంకి దర్శకత్వం
- ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న చిత్రం
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరో వారసుడి తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది. మాస్ మహారాజా రవితేజ తమ్ముడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా పేరు 'మిస్టర్ ఇడియట్'. ఇవాళ టైటిల్ అనౌన్స్ చేశారు. టైటిల్ పోస్టర్ ను రవితేజ విడుదల చేశారు.

'మిస్టర్ ఇడియట్' చిత్రానికి జేజేఆర్ రవిచంద్ నిర్మాత. ఈ సినిమా ఇటీవలే ప్రారంభోత్సవం జరుపుకుంది. హైదరాబాదులో లాంఛనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.