DGP TELANGANA: రైలు ప్రమాదంపై తెలంగాణ డీజీపీ ట్వీట్

Telangana DGP tweets on train fire accident

  • అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్న డీజీపీ
  • ప్రయాణికులందరినీ బస్సుల్లో తరలించామని వెల్లడి
  • 7 బోగీల్లో మంటలు చెలరేగాయని, 3 బోగీల్లో మంటలను ఆర్పివేశారని ట్వీట్

హౌరా నుంచి సికింద్రాబాద్‌ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. యాదాద్రి జిల్లా బీబీ నగర్ మండలం పగిడిపల్లి - బొమ్మాయిపల్లి మధ్య ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ స్పందించారు. అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని చెప్పారు.

‘‘భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందికి దించేశాం. వారిని బస్సుల్లో తరలించాం” అని ట్వీట్ చేశారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ, రైల్వే శాఖ సమన్వయంతో పనిచేస్తున్నాయని, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, ఎవరూ గాయపడలేదని పేర్కొన్నారు.

సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. 
‘‘మొత్తం 18 కోచ్‌లలో 11 కోచ్‌లను వేరు చేసి.. వాటిని సురక్షితంగా తరలించారు. 7 బోగీల్లో మంటలు చెలరేగాయి. అందులో 3 బోగీల్లో మంటలను ఆర్పివేశారు” అని చెప్పారు.

  • Loading...

More Telugu News