MS Dhoni: ఎన్టీఆర్ జిల్లాలో 77 అడుగుల మహేంద్ర సింగ్ ధోనీ కటౌట్ ఏర్పాటు

Dhoni 77 feet cutout in Andhra Pradesh

  • రేపు ధోనీ జన్మదినం సందర్భంగా కటౌట్ ఏర్పాటు
  • తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో భారీ కటౌట్‌లు
  • రహదారిపై వెళ్తున్న వారిని ఆకట్టుకుంటున్న కటౌట్

మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులు నందిగామలో భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబారుపేట గ్రామం వద్ద రేపు ధోనీ 44వ జన్మదినాన్ని పురస్కరించుకొని 77 అడుగుల భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. ఈ కటౌట్ ఆ రహదారిపై నుండి వెళ్తున్న వారిని ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఓ అభిమాని మాట్లాడుతూ... రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులం కలిసి పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పాడు. తెలంగాణలో ఇప్పటికే 52 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేశామని, ఇక్కడ 77 అడుగులది పెట్టామన్నాడు. తాము ధోనీపై అభిమానంతో ఇదంతా చేస్తున్నామన్నాడు.

MS Dhoni
Andhra Pradesh
  • Loading...

More Telugu News