Ch Malla Reddy: సరదాగా గొర్రెలు కాసిన మంత్రి మల్లారెడ్డి... వీడియో ఇదిగో!

Mallareddy turns as a shepherd

  • మేడ్చల్  మండలంలో గొర్రెల పంపిణీ
  • హాజరైన మంత్రి మల్లారెడ్డి
  • గొర్రెల కాపరి అవతారం ఎత్తి వినోదం పంచిన మంత్రి
  • సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్న వీడియో

తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి ఎంత సరదాగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఆయన ప్రసంగాలు చాలావరకు ఛలోక్తులు, చమత్కారాలతో సాగుతుంటాయి. తాజాగా, మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ మండలంలో గొర్రెల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. లబ్దిదారులకు గొర్రెలు పంపిణీ చేశారు. 

అనంతరం తన ట్రేడ్ మార్కు విన్యాసాలకు తెరలేపారు. గొర్రెల కాపరిలా తలపై కంబళి కప్పుకుని, కర్ర చేతపట్టుకుని గొర్రెలు కాశారు. వాటిని సమీపంలోని చిట్టడవికి మళ్లించి గొర్రెల కాపరిలా ఫొటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. 

గొర్రెల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తొమ్మిదేళ్లకు ముందు ఏ ప్రభుత్వం కూడా కుల సంఘాలను ఆదుకోలేదని అన్నారు. సీఎం కేసీఆర్ వచ్చాక ప్రతి కుల సంఘాన్ని ఆదుకుంటున్నారని తెలిపారు. కురుమ యాదవులకు ఇంకా లబ్ది చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. 

"మనం అందరం అదృష్టవంతులం... మనకు కేసీఆర్ వంటి సీఎం, కేటీఆర్ ఉన్నారు" అని వెల్లడించారు. గొర్రెల పంపిణీలో మేడ్చల్ మండలానికి 15 యూనిట్లు కేటాయించినట్టు మల్లారెడ్డి తెలిపారు.

Ch Malla Reddy
Shepherd
Medchal
BRS
Telangana
  • Loading...

More Telugu News