Threads: దూసుకెళ్తున్న ‘థ్రెడ్స్’.. రికార్డు స్థాయిలో 7 గంటల్లోనే కోటి మందికిపైగా యూజర్లు

10 Million Sign Ups In 7 Hours Will Zuckerbergs Threads Beat Musks Twitter

  • ట్విట్టర్‌‌కు పోటీగా ఈరోజే ‘థ్రెడ్స్‌’ను లాంచ్ చేసిన మెటా
  • తొలి రెండు గంటల్లోనే 2 మిలియన్లకు పైగా సైన్ అప్స్
  • ట్విట్టర్‌‌ను బీట్ చేస్తుందా అంటూ అప్పుడే చర్చ

థ్రెడ్స్ .. మెటా తీసుకువచ్చిన కొత్త ప్లాట్‌ఫామ్. ట్విట్టర్‌‌కు పోటీగా ఈ రోజే వచ్చిన థ్రెడ్స్ యాప్‌ దూసుకుపోతోంది. దీన్ని ప్రారంభించిన 7 గంటల్లోనే 10 మిలియన్ల యూజర్లను సొంతం చేసుకుంది. దీంతో ట్విట్టర్‌‌ను థ్రెడ్స్‌ బీట్ చేస్తుందా? అనే చర్చ అప్పుడే మొదలైంది.

అంతకుముందు మొదటి రెండు గంటల్లోనే 2 మిలియన్లకు పైగా సైన్ అప్‌లను అందుకుందని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ పోస్ట్ చేశారు. తొలి నాలుగు గంటల్లోనే 5 మిలియన్ల సైన్ అప్‌లను పొందిందని మరో అప్‌డేట్ ఇచ్చారు. తర్వాత మరో మూడు గంటల్లోనే కోటి మంది యూజర్ల మార్క్‌ను అందుకుంది.

థ్రెడ్స్ ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూ టిక్ ఉంటే.. థ్రెడ్స్‌ యాప్‌లోనూ అకౌంట్‌ ఆటోమేటిక్‌గా వెరిఫై అవుతుంది. యాప్‌ను యాపిల్‌ స్టోర్‌ నుంచి సైతం ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. థ్రెడ్‌ యాప్‌లో ఇన్ స్టాగ్రామ్ ఐడీతో లాగిన్ కావచ్చు. ట్విట్టర్‌ను ఉపయోగిస్తున్న వారికి.. థ్రెడ్స్‌ వాడటం చాలా ఈజీ.

  • Loading...

More Telugu News