Yuva Galam Padayatra: జగనోరా వైరస్‌తోనే ఎక్కువ డేంజర్, చంద్రబాబే వ్యాక్సిన్: నారా లోకేశ్

Nara lokesh padayatra gets huge response in spsr nellore district

  • కోవూరు నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగిన పాదయాత్ర
  • వైసీపీ పాలనను ఎండగట్టిన నారా లోకేశ్
  • జగన్ అప్పులతో ప్రజలపై భారం అంటూ మండిపాటు
  • మాజీ మంత్రి అనిల్ అక్రమాస్తుల చిట్టా విడుదల

టీడీపీ యువనేత మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 147వ రోజు కోవూరు నియోజకవర్గంలో జనసందోహం నడుమ ఉత్సాహంగా సాగింది. లోకేశ్‌‌ను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆయనకు బ్రహ్మరథం పట్టారు. పలు వర్గాల ప్రజలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. 

రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే!
రాష్ట్రానికి చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్ అని, టీడీపీ అధికారంలోకి వచ్చాక పెద్దఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించి తీరుతారని యువనేత నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఎస్ పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం సాలుచింతలలో మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. జగన్ ప్రభుత్వం చేతిలో మీడియా ప్రతినిధులు కూడా బాధితులేనని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వారికి ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. 

జగన్ చేసే అప్పుల భారమంతా ప్రజలపైనే!
జగన్ చేసే అప్పులు ప్రజలపై భారం మోపుతోందని లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. అగ్రరాజ్యాల్లోనూ సంక్షేమ పథకాలు ఉన్నాయి కానీ ఎకానమీని ముందుకు తీసుకెళ్లాలని హితవు పలికారు. చంద్రబాబు ఉన్నప్పుడు ఉన్న గ్రోత్ రేట్ ఇప్పుడు లేదని అన్నారు. వ్యవసాయం వెనకబడిందని చెప్పారు.

కరోనా కంటే జగనోరా వైరస్ ప్రమాదకరం
కరోనా కంటే ప్రమాదకరం జగనోరా వైరస్, అన్ని వ్యవస్థల్ని జగనోరా వైరస్ నాశనం చేసిందని యువనేత నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. వ్యాపారస్తులు కూడా జగనోరా వైరస్ బాధితులేనని పేర్కొన్నారు. కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం సాలుచింతల క్యాంప్ సైట్‌లో వ్యాపారులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో యువనేత లోకేశ్ మాట్లాడుతూ...‘‘జగనోరా వైరస్ కి వ్యాక్సిన్ చంద్రబాబు నాయుడు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకునే వారు. జగన్ పాలనలో క్రాప్ హాలిడే, ఆక్వా హాలిడే చూశాం. త్వరలో వ్యాపారస్తులు బిజినెస్ హాలిడే ప్రకటించే ప్రమాదం ఉంది’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అనిల్ అక్రమాస్తుల డాక్యుమెంట్లు విడుదలచేసిన లోకేశ్ 
కోవూరు నియోజకవర్గం సాలుచింతల క్యాంప్ సైట్‌లో యువనేత నారా లోకేశ్ మీడియాతో చిట్‌చాట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అనిల్ భూఅక్రమాలు, బినామీల పేరుతో చేసిన భూదందాలకు సంబంధించిన ఆధారాలు విడుదల చేశారు. ‘‘దొంతాలి వద్ద బినామీలు చిరంజీవి, అజంతా పేరు మీద 50 ఎకరాలు. విలువ రూ.10 కోట్లు. నాయుడుపేటలో 58 ఎకరాలు బినామీ పేర్లతో. విలువ రూ.100 కోట్లు. ఇనుమడుగు సెంటర్ లో  బినామీలు రాకేష్, డాక్టర్ అశ్విన్ పేరుతో 400 అంకణాలు. విలువ రూ.10 కోట్లు. ఇస్కాన్ సిటీలో బినామీల పేర్లతో 87 ఎకరాలు. విలువ రూ. 33 కోట్లు. అల్లీపురంలో 4వ డివిజన్ కార్పొరేటర్, డాక్టర్ అశ్విన్ (అనిల్ తమ్ముడు) పేరుతో 42 ఎకరాలు. విలువ రూ.105 కోట్లు. ఇందులో 7 ఎకరాలు ఇరిగేషన్ భూమి. సాదరపాళెంలో 4వ డివిజన్ కార్పొరేటర్, డాక్టర్ అశ్విన్ (అనిల్ తమ్ముడు) పేరుతో 12 ఎకరాలు. విలువ రూ.48 కోట్లు. ఒక పెద్ద కాంట్రాక్టర్ నుండి దశల వారీగా అనిల్ బినామీ చిరంజీవికి కోట్ల రూపాయలు వచ్చాయి. బృందావనంలో శెట్టి సురేష్ అనే బినామీ పేరుతో 4 ఎకరాలు. విలువ 25 కోట్లు. దామరమడుగులో బావమరిది పేరుతో 5 ఎకరాలు. విలువ 4 కోట్లు. గూడూరు- చెన్నూరు మధ్యలో 120 ఎకరాలు లేపేసాడు. 40 ఎకరాల్లో లే అవుట్ వేశారు’’ అని లోకేశ్ చెప్పారు. అంతకుమునుపు, అనేక మంది యువనేతను కలిసి తమ సహచరులతో సహా టీడీపీలో చేరారు. 


యువనేత నారా లోకేశ్  యువగళం పాదయాత్ర వివరాలు
ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం – 1917.1 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం – 15.9 కి.మీ.

148వ రోజు పాదయాత్ర వివరాలు (6-7-2023):
కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్ పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా)
సాయంత్రం
4.00 – చెల్లాయపాలెం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
4.30 – బుచ్చిరెడ్డిపాలెం అంబేద్కర్ జంక్షన్ లో స్థానికులతో మాటామంతీ.
5.00 – బుచ్చిరెడ్డిపాలెం జంక్షన్ లో బహిరంగసభ, యువనేత లోకేశ్ ప్రసంగం.
6.10 – బుచ్చిరెడ్డిపాలెం మెయిన్ బజార్ లో స్థానికులతో సమావేశం.
6.25 – బుచ్చిరెడ్డిపాలెం రిజిస్ట్రార్ ఆఫీసు వద్ద స్థానికులతో సమావేశం.
6.45 – ఇస్కపాలెంలో స్థానికులతో సమావేశం.
7.45 –  నాగం అంబాపురం కొట్టాల వద్ద స్థానికులతో సమావేశం.
7.55 – రామాపురం ఎన్టీఆర్ కాలనీలో స్థానికులతో సమావేశం.
8.30  – మిక్కిలింపేటలో స్థానికులతో మాటామంతీ.
9.10 – యల్లాయపాలెంలో రైతులతో సమావేశం.
10.20 – రాజుపాలెం పిఎస్ఆర్ కళ్యాణ మండపం వద్ద విడిది కేంద్రంలో బస.

  • Loading...

More Telugu News