Rana Daggubati: 'రాక్షస రాజు'గా రానా .. రెండు భాగాలుగా రిలీజ్!

Rana in Teja Movie

  • తేజ దర్శకత్వంలో ఒక సినిమా చేసిన రానా
  • 'నేనే రాజు నేనే మంత్రి'గా వచ్చిన ఆ సినిమా హిట్ 
  • 'రాక్షస రాజు'తో వచ్చేనెలలో సెట్స్ పైకి 
  • ఏకధాటిగా జరగనున్న షూటింగు
  • పార్టు 1 .. పార్టు 2గా ప్రేక్షకుల ముందుకు

రానా ఈ మధ్య కాలంలో తన దూకుడు తగ్గించాడనే చెప్పాలి. అంతకుముందు వరుస ఫ్లాపులు రావడంతోనే ఆయన ఇలా కొంత గ్యాప్ తీసుకున్నాడని అంటారు. తరువాత ప్రాజెక్టుల విషయంలో ఆయన మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టుగా చెబుతున్నారు. అందులో భాగంగా ఆయన చేయనున్న సినిమానే 'రాక్షస రాజు'.

ఇంతకుముందు తేజ దర్శకత్వంలో రానా 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాను చేశాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. రానా బాడీ లాంగ్వేజ్ కి తగిన కంటెంట్ అని అంతా చెప్పుకున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రానున్నట్టుగా ఇటీవలే వార్తలు షికారు చేయడం మొదలైంది. అయితే రానా సోదరుడితో తేజ చేసిన సినిమా డిజాస్టర్ కావడంతో, రానాతో తేజ ప్రాజెక్టు ఉండకపోవచ్చని అనుకున్నారు. 

కానీ ఈ ప్రాజెక్టు ఉందనీ.. వచ్చేనెల నుంచి సెట్స్ పైకి వెళ్లే దిశగా సన్నాహాలు చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఈ సినిమా షూటింగు అంతా కూడా ఏకధాటిగా కొనసాగుతుందని అంటున్నారు. అంతా అయ్యాక రెండు భాగాలుగా ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మొదటి భాగం థియేటర్లకు వచ్చిన మూడు నెలలకి, రెండో భాగం రిలీజ్ చేస్తారట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు తెలియనున్నాయి. 

Rana Daggubati
Actor
Teja
Director
Rakshasa Raju
  • Loading...

More Telugu News