విజయ్ దేవరకొండ ఈ గండం గట్టెక్కాల్సిందే!
- వరుస ఫ్లాపులతో ఉన్న విజయ్ దేవరకొండ
- సక్సెస్ కోసమే చాలా కాలంగా వెయిటింగ్
- బరిలోకి దిగడానికి రెడీ అవుతున్న 'ఖుషీ'
- చేతిలో మరో రెండు ప్రాజెక్టులు
విజయ్ దేవరకొండ తన ఖాతాలో కొన్ని మంచి హిట్స్ వేసుకున్నాడు. ఆ తరువాత వచ్చిన సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ, అంతకుముందు వచ్చిన సక్సెస్ ల ప్రభావంతోనే కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. గతంలో మాటల యుద్ధం పట్ల ఎక్కువ ఆసక్తిని చూపుతూ వచ్చిన విజయ్ దేవరకొండ, ఆ తరువాత చేతలపైనే ఫోకస్ పెట్టాడు. అయితే ఈ లోగానే ఆయనకి వరుస పరాజయాలు ఎదురయ్యాయి.
2018 నుంచి ఇంతవరకూ ఆయన హిట్ లేదు. ఒక సినిమాకి మించి మరొక సినిమా ఫ్లాప్ బాటపట్టాయి. ఇలాంటి ఒక పరిస్థితిలో ఆయన నుంచి రావడానికి 'ఖుషీ' రెడీ అవుతోంది. ఈ సినిమా ఫలితం ఆయనకి ఒక పరీక్షా సమయమే .. ఈ గండాన్ని తప్పకుండా ఆయన గట్టెక్కవలసిందే. ఈ సినిమా హిట్ అయితే ఆయన క్రేజ్ .. మార్కెట్ మళ్లీ దార్లో పడిపోతాయి. ఆ తరువాత ప్రాజెక్టులుగా గౌతమ్ తిన్ననూరి .. పరశురామ్ సినిమాలు ఉన్నప్పటికీ, 'ఖుషీ' హిట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పాలి.