Rahul Gandhi: మోదీ ఇంటి పేరుపై వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి ఝార్ఖండ్ హైకోర్టులో ఊరట

Jharkhand HC exempts Rahul Gandhi from personal appearance

  • 2019లో మోదీ ఇంటి పేరుపై కాంగ్రెస్ అగ్రనేత ఘాటు విమర్శలు
  • పరువు నష్టం కేసులో వ్యక్తిగతంగా హాజరు కావాలని రాంచీ కోర్టు ఆదేశాలు
  • హైకోర్టులో అప్పీల్ చేసిన రాహుల్ గాంధీ
  • వ్యక్తిగత హాజరు నుండి రాహుల్ గాంధీకి మినహాయింపును ఇచ్చిన పైకోర్టు

మోదీ ఇంటి పేరుతో గత లోక్ సభ ఎన్నికల్లో తీవ్రఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి మంగళవారం ఊరట దక్కింది. వ్యక్తిగత హాజరు నుండి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడికి ఝార్ఖండ్ హైకోర్టు మినహాయింపును ఇచ్చింది. అదే సమయంలో రాహుల్ పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని జస్టిస్ ఎస్కే ద్వివేది ఆదేశాలు జారీ చేశారు.

పరువునష్టం కేసులో తనను వ్యక్తిగతంగా హాజరుకావాలని రాంచీ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఆదేశించడంతో, కాంగ్రెస్ అగ్రనేత హైకోర్టును ఆశ్రయించారు. పైకోర్టులో రాహుల్ గాంధీకి తాత్కాలిక ఊరట లభించింది. కేసు విచారణను ఆగస్ట్ 16కు వాయిదా వేసింది. 

దొంగలందరూ మోదీ అనే ఇంటిపేరును ఎందుకు పెట్టుకుంటారంటూ 2019 ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రదీప్ మోదీ పరువు నష్టం కేసు వేశారు. ఇదే కేసులో ఈ వ్యాఖ్యలకు గాను రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారిస్తూ మార్చి 23న సూరత్ లోని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో వాయనాడ్ ఎంపీగా ఉన్న రాహుల్‌పై అనర్హత వేటు పడింది.

  • Loading...

More Telugu News