Ram Charan: రహస్యాన్ని ఛేదించిన రామ్ చరణ్... మీషో కొత్త యాడ్ వీడియో ఇదిగో!

Ram Charan acts in Meesho ad

  • రామ్ చరణ్ ఖాతాలో కొత్త యాడ్
  • మీషో యాడ్ లో అండర్ కవర్ ఏజెంట్ గా నటించిన రామ్ చరణ్
  • మీషో యాప్ ద్వారా తక్కువ ధరకే లభిస్తాయని చెప్పే ప్రయత్నం
  • యాడ్ లో తన నటనతో ఆకట్టుకున్న గ్లోబల్ స్టార్

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ తో బిజీగా ఉంటూనే, మరోవైపు యాడ్స్ తోనూ దూసుకుపోతున్నాడు. తాజాగా రామ్ చరణ్ మీషో యాప్ కోసం ఓ వాణిజ్య ప్రకటనలో నటించాడు. ఈ యాడ్ లో చరణ్ ఓ అండర్ కవర్ ఏజెంట్ గా కనిపిస్తాడు. 

ఓ వ్యక్తిని పట్టుకుని రహస్యాన్ని ఛేదించాలని తన బాస్ నుంచి ఆదేశాలు రావడంతో, రామ్ చరణ్ ఆ వ్యక్తిని పట్టుకుంటాడు. ఆ వ్యక్తి ధరించిన జాకెట్ రూ.6 వేలు ఉంటుందని భావించిన రామ్ చరణ్, అదే విషయమై ఆ వ్యక్తిని ప్రశ్నించగా, రూ.600కే కొన్నానని ఆ వ్యక్తి చెబుతాడు. ఎక్కడ కొన్నావని అడగ్గా, మీషోలో అని ఆ వ్యక్తి బదులిస్తాడు. 

దాంతో ఇంపాజిబుల్ అంటూ రామ్ చరణ్ బాస్ నుంచి రెస్పాన్స్ వస్తుంది. కాదు, పాజిబులే... ఎందుకంటే ఫ్యాక్టరీ నుంచి నేరుగా వస్తాయి కాబట్టి ధర తక్కువే అంటూ వాయిస్ ఓవర్ ద్వారా యాడ్ చివర్లో వివరణ ఇస్తారు. 

మొత్తానికి ఖరీదైన దుస్తులు సైతం మీషోలో తక్కువ ధరకే వస్తాయని ఈ యాడ్ ద్వారా చెప్పారు. ఇక, రామ్ చరణ్ ఎప్పట్లాగానే తనదైన స్టయిల్లో నటించారు. కాగా, హిందీలో ఇదే యాడ్ ను రణవీర్ సింగ్,  దీపిక పదుకొనేతో చిత్రీకరించారు.

Ram Charan
Meesho
Ad
Secret
Agent

More Telugu News