Jagapathi Babu: విలనిజంతో మరోసారి విజృంభిస్తున్న జగ్గూ భాయ్!

Rudrangi Movie Update

  • పవర్ఫుల్ విలన్ గా ఎదిగిన జగపతిబాబు 
  • గ్రామీణ నేపథ్యంలో మరోసారి విలన్ రోల్
  • 'రుద్రంగి'లో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ 
  • ఈ నెల 7వ తేదీన సినిమా విడుదల

వెండితెరపై స్టార్ హీరోగా వెలిగిన చాలామంది అంతకుముందు విలన్ పాత్రలు చేశారు. కానీ స్టార్ హీరోగా వెలిగిన తరువాత విలన్ పాత్రల వైపు వెళ్లి, స్టార్ విలన్ గా అత్యధిక పారితోషికం అందుకున్నవారు చాలా అరుదు. అలాంటివారి జాబితాలో జగపతిబాబు ఒకరు. తెలుగులోనే కాదు ఇతర భాషల్లోను విలన్ గా ఆయన బిజీ బిజీ. 

గ్రామీణ నేపథ్యంలో విలనిజంతో కథ పదునుపెరిగేలా చేసిన నటుడాయన. 'రంగస్థలం' .. 'అరవింద సమేత' వంటి సినిమాలలో ఆయన తన విలనిజంతో విరుచుకుపడ్డారు. అలాంటి జగపతిబాబు ఇప్పుడు మరోసారి విలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో తన విలనిజాన్ని చూపించడానికి రెడీ అవుతున్నారు .. ఆ సినిమానే 'రుద్రంగి'. 

ఈ నెల 7వ తేదీన ఈ సినిమా థియేటర్స్ కి రానుంది. ఈ సినిమాలో భీమ్ రావ్ దేశ్ ముఖ్ పాత్రలో ఆయన కనిపించనున్నారు. ఈ సినిమాలో చిత్రంగా అరుస్తూ ఆయన చూపించిన మేనరిజం కొత్తగా అనిపిస్తోంది. ఈ సినిమాపై ఆడియన్స్ లో ఆసక్తి పెరగడానికి ఆయన పాత్ర ప్రధానమైన కారణంగా కనిపిస్తోంది. విలనిజం పరంగా జగపతిబాబు కెరియర్లో నిలిచిపోయిన సినిమాలలో ఇది కూడా ఒకటిగా కనిపించే అవకాశం ఉంది.

Jagapathi Babu
Vimala Raman
Mamatha Mohandas
Rudrangi
  • Loading...

More Telugu News