Kajal Agarwal: కాజల్ బెస్ట్ ఫ్రెండ్స్ ఈ భామలేనట!

Kajal Special

  • గట్టిపోటీని తలచుకుని నిలబడిన కాజల్ 
  • షూటింగు దశలో 60వ సినిమా 
  • తాను డిప్రెషన్ లోకి వెళ్లానన్న కాజల్ 
  • తన భర్త అండగా నిలబడ్డాడని వెల్లడి 

కథానాయికగా తెరపై కనిపించడం .. స్టార్ డమ్ ను సంపాదించుకోవడం .. ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడం అంత తేలికైన పనేం కాదు. ఏ రోజుకు ఆ రోజు ఇతర భాషల నుంచి .. ప్రాంతాల నుంచి హీరోయిన్ వేషాల కోసం చాలా మంది దిగిపోతుంటారు. అంతటి పోటీని తట్టుకుని ఎదగడం ఆషామాషీ కాదు. సుకుమారంగా కనిపించే కాజల్ మాత్రం ఆ పోటీని తట్టుకుంది. 

సుదీర్ఘమైన తన కెరియర్ లో 59  సినిమాలను పూర్తిచేసిన ఆమె, 60వ సినిమాగా 'సత్యభామ' చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పై ఉంది. నాయిక ప్రధానమైన పాత్రలో కాజల్ చేస్తున్న సినిమా ఇది. ఇక 'భగవంత్ కేసరి' సినిమాలో ఆమె బాలయ్య సరసన నాయికగా అలరించనుంది. అలాంటి కాజల్ రీసెంట్ గా ఇన్ స్టా వేదికగా నెటిజన్స్ తో ముచ్చటించింది.

నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు కాజల్ స్పందిస్తూ .. "ఇండస్ట్రీలో సమంత .. తమన్నా .. రకుల్ నాకు బెస్ట్ ఫ్రెండ్స్. మేమంతా తరచూ ఫోన్ లో మాట్లాడుకుంటూనే ఉంటాము. మా అందరికీ తీరిక దొరికితే హోటల్లో కలుస్తుంటాము. ఇక డెలివరీ తరువాత నేను కూడా కాస్త డిప్రెషన్ కి గురయ్యాను. ఆ సమయంలో నాకు నా భర్త ఎంతో సపోర్టుగా నిలిచారు" అంటూ చెప్పుకొచ్చింది.

Kajal Agarwal
Samantha
Tamannah
Rakul Preet Singh
  • Loading...

More Telugu News