Suneetha: తనయుడి ఫస్ట్ లుక్ చూసి భావోద్వేగాలకు గురైన గాయని సునీత

Singer Sunnetha gets emotional after seeing her son first look

  • రాఘవేంద్రరావు నిర్మాణ సారథ్యంలో సర్కారు నౌకరి
  • గంగమోని శేఖర్ దర్శకత్వంలో చిత్రం
  • హీరోగా పరిచయం అవుతున్న సింగర్ సునీత కుమారుడు ఆకాశ్

టాలీవుడ్ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నిర్మాతగా, గంగమోని శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సర్కారు నౌకరి. ఈ చిత్రం ద్వారా గాయని సునీత కుమారుడు ఆకాశ్ గోపరాజు హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇవాళ ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ విడుదలైంది. సింగర్ సునీత తన కుమారుడి ఫస్ట్ లుక్ చూసి భావోద్వేగాలకు లోనయ్యారు. ఈ మేరకు తన స్పందనను సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నారు. 

నటుడు కావాలని నువ్వు పడిన కష్టం, నీ కలను సాకారం చేసుకునేందుకు నువ్వు పడిన శ్రమ, సినిమా పట్ల నీకున్న నిబద్ధతకు, నటుడు అయ్యేందుకు నువ్వు చేసిన త్యాగాలకు ఈ ఫస్ట్ లుక్ అద్దం పడుతోంది అని సునీత పేర్కొన్నారు. ఒక తల్లి, కొడుకు కల నెరవేరిన రోజు ఇది... కంగ్రాట్స్ ఆకాశ్ అంటూ స్పందించారు. 

ప్రపంచంతో నువ్వు పంచుకోనున్న కథను, సినిమా పట్ల నీ మమకారాన్ని త్వరలోనే అందరూ చూడనున్నారు... ఆల్  ది బెస్ట్ అంటూ సునీత కుమారుడికి ఆశీస్సులు అందించారు.

More Telugu News