Ambati Rambabu: పవన్ కల్యాణ్ పిచ్చి కుక్కలా స్వైర విహారం చేశాడు: అంబటి రాంబాబు

Ambati Rambabu satires on Pawan Kalyan

  • నా కొడకల్లారా అనే పదాన్ని ఉపయోగించిన వ్యక్తి పవన్ అన్న అంబటి
  • రాజకీయాల్లో పవన్ ఒక చీడ పురుగు అని విమర్శ
  • చంద్రబాబు సీఎం కావాలనేదే పవన్ లక్ష్యమని ఆరోపణ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు, భీమవరంలో నిన్న ఏర్పాటు చేసిన జనసేన సభలో పవన్ ఒక వీధి రౌడీలా మాట్లాడారని అన్నారు. పిచ్చి కుక్కలా స్వైర విహారం చేశారని మండిడ్డారు. నా కొడకల్లారా అనే పదాన్ని ఉపయోగించిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని... రాజకీయాల్లో ఆయన ఒక చీడ పురుగు అని అన్నారు. పాలిటిక్స్ కు పవన్ పనికిరాడని చెప్పారు. 

పవన్ కులాలను రెచ్చగొడుతున్నారని అంబటి విమర్శించారు. కాపులందరినీ టీడీపీ అధినేత చంద్రబాబు చంకనెక్కించాలని చూస్తున్నారని అన్నారు. చంద్రబాబు సీఎం కావాలనేదే పవన్ లక్ష్యమని, పెత్తందార్ల పల్లకిని పవన్ మోస్తున్నారని చెప్పారు. జనసేన వారాహి విజయ యాత్ర పేరులో మాత్రమే విజయం ఉందని... ఇప్పటి వరకు విజయం లేని, ఎప్పటికీ విజయం రాని పార్టీ జనసేన అని ఎద్దేవా చేశారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఎవరి జెండాను ఎగురవేస్తారో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. డబ్బు కోసం పవన్ నాటకాలు ఆడుతున్నారనే విషయాన్ని జనసైనికులు తెలుసుకోవాలని అన్నారు.

Ambati Rambabu
YSRCP
Pawan Kalyan
Janasena
Chandrababu
Telugudesam
  • Loading...

More Telugu News