Ward Police: వైసీపీ నేతలు వేధిస్తున్నారంటూ.. సీఎం క్యాంపు కార్యాలయం వద్ద వార్డు మహిళా పోలీసు నిరసన

Ward Police protest against ycp leaders at cm jagan camp office

  • మచిలీపట్టణంలోని 17వ వార్డు మహిళా పోలీసుగా పనిచేసిన లక్ష్మీప్రసన్న
  • వైసీపీ నేతలు తనపై తప్పుడు కేసులు పెట్టించి ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపణ
  • ఉద్యోగంలోకి తిరిగి తీసుకున్నా విధులు చేయనీయడం లేదని ఆవేదన

మచిలీపట్టణంలోని 17వ వార్డు సచివాలయంలో మహిళా పోలీసుగా పనిచేసిన సైకం లక్ష్మీప్రసన్న నిన్న తాడేపల్లిలోని సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. వైసీపీ నేతలు కొందరు తనపై తప్పుడు కేసులు పెట్టి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయించారని, ఏడాదిగా జీతం ఇవ్వకుండా వేధిస్తున్నారని వాపోయారు. ఉద్యోగంలోకి తిరిగి తీసుకున్నట్టు కాగితాల్లో చూపించినా విధులు చేయనీయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆరు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, వైసీపీలోని కీలక నేత కుమారుడు తన సమస్యను పరిష్కరించకుండా అడ్డుకుంటున్నాడని పేర్కొన్నారు. తన పిల్లలకు ప్రాణహాని ఉండడంతో స్కూలుకు పంపలేకపోతున్నానంటూ నిరసనకు దిగారు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

  • Loading...

More Telugu News