AAP: కేంద్రం ఆర్డినెన్స్‌పై సుప్రీం కోర్టు గడప తొక్కిన కేజ్రీవాల్ ప్రభుత్వం

Delhi govt moves SC against Centres ordinance over control of services

  • కేంద్రం ఆర్డినెన్స్ రాజ్యాంగ వ్యతిరేకమని, వెంటనే రద్దు చేయాలని పిటిషన్
  • బ్లాక్ ఆర్డినెన్స్ ద్వారా ఢిల్లీని అక్రమంగా తమ చేతిలోకి తీసుకునే ప్రయత్నమని వెల్లడి
  • ఈ ఆర్డినెన్స్‌పై న్యాయపరంగా, రాజకీయంగా పోరు చేయాలని ఆమ్ ఆద్మీ నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీం కోర్టు గడప తొక్కింది. కేంద్రం ఆర్డినెన్స్ రాజ్యాంగ వ్యతిరేకమని, దీనిని వెంటనే రద్దు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొంది. బ్లాక్ ఆర్డినెన్స్ ద్వారా ఢిల్లీని అక్రమంగా తమ కంట్రోల్ లో పెట్టుకోవాలని కేంద్రం చూస్తోందని అందులో పేర్కొన్నారు.

కేంద్రం మే 19న ఢిల్లీ బ్యూరోక్రాట్లకు సంబంధించి ట్రాన్స్‌ఫర్స్, పోస్టింగ్ కు సంబంధించి ఆర్డినెన్స్ ను తీసుకు వచ్చింది.  ఢిల్లీ బ్యూరోక్రాట్ల బ‌దిలీలు, పోస్టింగ్‌ల‌పై ప‌ట్టుకోసం కేంద్రం జారీ చేసిన ఢిల్లీ ఆర్డినెన్స్‌కు వ్య‌తిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ చట్టపరంగా పోరాటం చేయడంతో పాటు బయట కూడా ఉద్యమిస్తోంది. ఇందులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఆర్డినెన్స్‌పై తాజాగా సుప్రీం గడపను తొక్కింది. అలాగే, జులై 3 నుంచి ఆర్డినెన్స్ ప్ర‌తుల‌ను ద‌గ్ఢం చేసేలా ద‌శ‌ల వారీ ప్ర‌చార కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చింది.

కాగా, ఈ ఆర్డినెన్స్ కు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర పార్టీల సహకారం కూడా కోరుతోంది. పార్లమెంటులో ఆర్డినెన్స్ ను అడ్డుకోవాలని కాంగ్రెస్ సహా వివిధ పార్టీలను కోరుతోంది. అయితే కాంగ్రెస్ ఈ అంశంపై మౌనం దాల్చింది. ఇటీవల పాట్నాలో విపక్షాల కూటమి సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ అల్టిమేటం జారీ చేసింది. ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ తమతో కలిసి వస్తేనే వచ్చేసారి కూటమి సమావేశంలో పాల్గొంటామని తేల్చి చెప్పింది.

  • Loading...

More Telugu News