Cricket: స్మిత్ క్యాచ్‌పై థర్డ్ అంపైర్ నిర్ణయం పట్ల విమర్శలు

Steve Smiths Catch To Dismiss Joe Root In 2nd Ashes Test Sparks Controversy

  • డబ్ల్యుటీసీ ఫైనల్‌లో గిల్ క్యాచ్ విషయంలో గ్రీన్‌పై విమర్శలు
  • యాషెస్ తొలి టెస్ట్‌లోను క్యాచ్ వివాదం
  • ఇప్పుడు జోరూట్ కొట్టిన బంతిని స్మిత్ క్యాచ్ పట్టడంపై విమర్శలు

ఇంగ్లండ్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్ లో థర్డ్ అంపైర్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. డబ్ల్యుటీసీ ఫైనల్ లో గిల్ క్యాచ్ విషయంలో కామెరూన్ గ్రీన్‌పై విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత యాషెస్ తొలి టెస్ట్ లో గ్రీన్ పట్టిన క్యాచ్ వివాదాస్పదం అయింది. అప్పుడు బ్యాటర్ డంకెట్ ఇచ్చిన క్యాచ్ ను థర్డ్ స్లిప్ లోని గ్రీన్ ఒడిసిపట్టాడు. కానీ బంతి నేలను తాకినట్లుగా ఉందని ఇంగ్లండ్ అభిమానులు విమర్శలు గుప్పించారు. ఇప్పుడు లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లోను క్యాచ్ వివాదం పునరావృతమైంది. ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ పట్టిన క్యాచ్‌పై ఇంగ్లండ్ అభిమానులు ఆగ్రహోద్రులవుతున్నారు.

తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 416 పరుగులు చేసి, ఆలౌట్ అయింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ రెండో రోజు ఆటలో రెండు వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బలమైన స్థితిలోనే ఉంది. కానీ ఆ తర్వాత వరుసగా రెండు వికెట్లు  కోల్పోయింది. డకెట్ 98 పరుగుల వద్ద ఔటై, సెంచరీ మిస్ చేసుకోగా, జోరూట్ 10 పరుగులకే ఔటయ్యాడు. రూట్ క్యాచ్ విషయంలో థర్డ్ అంపైరింగ్‌పై విమర్శలు వచ్చాయి.

స్టార్క్ వేసిన బంతిని జోరూట్ ఎదుర్కొనే క్రమంలో బ్యాక్ వర్డ్ స్క్వేర్ వద్ద ఉన్న స్మిత్ చేతికి చిక్కాడు. క్యాచ్ అందుకున్న విధానంపై అనుమానం ఉండటంతో ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ నిర్ణయానికి వదిలేశారు. పరిశీలించిన థర్డ్ అంపైర్ ఔట్ గా ప్రకటించాడు. కానీ రీప్లేలో బంతి నేలను తాకుతున్నట్లు ఉందని, ఔట్ ఇవ్వడం సరికాదని ఇంగ్లండ్ అభిమానులు మండిపడుతున్నారు.

  • Loading...

More Telugu News