Narendra Modi: ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన మోదీ.. ఫొటోలు ఇవిగో!

Modi travels in Delhi metro

  • ఢిల్లీ యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాలకు హాజరవుతున్న మోదీ
  • యూనివర్శిటీకి మెట్రో రైల్లో బయల్దేరిన ప్రధాని
  • రైల్లో విద్యార్థులతో ముచ్చటించిన వైనం

ప్రధాని మోదీ ఢిల్లీ మెట్రో రైల్లో ప్రయాణించారు. ఈరోజు ఢిల్లీ యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోదీ హాజరవుతున్నారు. ఈ క్రమంలో తన కాన్వాయ్ లో కాకుండా మెట్రో రైల్లో ప్రధాని యూనివర్శిటీకి పయనమయ్యారు. ప్రయాణం సందర్భంగా బోగీలో ఉన్న విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. 

మరోవైపు, మోదీ వస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు ఢిల్లీ యూనివర్శిటీ యాజమాన్యం మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యార్థులెవరూ నలుపు రంగు దుస్తులు ధరించి రావద్దని, అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది. ఉదయం 10-12 గంటల మధ్య క్లాసులను రద్దు చేస్తున్నట్టు పేర్కొంది.

Narendra Modi
BJP
Metro Rail
Delhi University

More Telugu News