Chandrababu: కేసీఆర్ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ జగన్‌పై చంద్రబాబు విమర్శలు

Chandrababu fires at YS Jagan by kcr words

  • ఒకప్పుడు ఏపీలో ఎకరా అమ్మితే తెలంగాణలో మూడు ఎకరాలు కొనేవాళ్లమని కేసీఆర్ చెప్పారన్న బాబు
  • హైటెక్ సిటీ కట్టాక రూ.30వేలుగా ఉన్న ఎకరా రూ.30 కోట్లకు చేరుకుందన్న టీడీపీ అధినేత
  • జగన్ ను ఓడించాల్సిందేనన్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు ఒక ఎకరా అమ్మితే తెలంగాణలో మూడు ఎకరాలు కొనేవాళ్లమని ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని, హైటెక్ సిటీ కట్టిన తర్వాత రూ.30వేలుగా ఉన్న ఎకరా భూమి రూ.30 కోట్లకు పెరిగిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 2019లో టీడీపీ ఓడిపోయిన తర్వాత నవ్యాంధ్రలో భూముల ధరలు పడిపోయాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు.. కొనేవాళ్లు లేరన్నారు. అందుకే ఏపీలో భూముల ధరలు తగ్గాయన్నారు. పటాన్ చెరులో ఎకరం భూమి రూ.30 కోట్లుగా ఉంటే, ఆ డబ్బుతో ఆంధ్రాలో వంద ఎకరాలు వస్తుందని కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు.

కియా మోటార్స్ రావడం వల్ల అనంతపురంలో, రాజధాని కాబట్టి అమరావతిలో భూమి విలువ పెరిగిందన్నారు. కానీ ఇప్పుడు ఏపీలో ఆ పరిస్థితి లేదన్నారు. మలేషియాలో రోడ్లను చూపించి వాజపేయిని ఒప్పించి నెల్లూరు నుండి చెన్నై వరకు తొలి రోడ్డు వేశామని, టీడీపీ తెచ్చిన విధానాలను, చేసే ఆలోచనలు అలా ఉంటే, వైసీపీ వేధింపుల వల్ల అమరరాజా వెళ్లిపోయిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఓడిస్తేనే రాష్ట్రం గెలుస్తుందన్నారు. ఈ నాలుగేళ్లు నరకం చూపించిన జగన్ ను ఏమాత్రం ఉపేక్షించవద్దన్నారు. పేదలను దోచేస్తూ, వారి పక్షమే అని చెప్పుకోవడం జగన్ కు మాత్రమే సాధ్యమైందన్నారు. కళ్లు మూయకుండా అబద్దాలు చెప్పడం జగన్ కే సాధ్యమన్నారు.

  • Loading...

More Telugu News