BRO: "కాలం మీ గడియారానికి అందని ఇంద్రజాలం"... పవన్, సాయితేజ్ టీజర్ అదిరింది 'బ్రో'

BRO teaser out now

  • పవన్ కల్యాణ్, సాయితేజ్ ప్రధానపాత్రల్లో బ్రో
  • సముద్రఖని దర్శకత్వం.. నేడు టీజర్ విడుదల
  • గంటలోనే 1.2 మిలియన్ల వ్యూస్
  • బ్రో చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే అందించిన త్రివిక్రమ్

మామ పవన్ కల్యాణ్, మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి తొలిసారి నటించిన చిత్రం బ్రో. సముద్రఖని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ ఎంటర్టయినర్ మూవీ నుంచి ఇవాళ టీజర్ రిలీజైంది. పవన్ గెటప్పులు, డైలాగులు సినిమాలో ఎలా ఉంటాయో ఈ టీజర్ లో శాంపిల్ గా చూపించారు. 

పవన్... సాయితేజ్ ను టీజ్ చేయడం... చిన్న పిల్లాడ్ని బ్రో అంటూ సాయితేజ్ తనదైన కామెడీ టైమింగ్ తో చెప్పిన డైలాగ్... కాలం మీ గడియారానికి అందని ఇంద్రజాలం అంటూ పవన్ ఫిలాసఫికల్ డైలాగ్ విసరడం... మొత్తమ్మీద బ్రోపై అంచనాలు పెంచేలా టీజర్ ఉంది. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మ్యాజికల్ గా ఉంటుందనడంలో సందేహంలేదు. 

టీజర్ విడుదలైన గంటలోనే 1.2 మిలియన్ల వ్యూస్ సంపాదించిందంటే బ్రో మేనియా ఎలా ఉందో అర్థమవుతోంది. కాగా, ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. 

జీ స్టూడియోస్ తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బ్రో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. నిన్ననే పవన్ కల్యాణ్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకున్నారు. బ్రో చిత్రం జులై 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

BRO
Teaser
Pawan Kalyan
Sai Dharam Tej
Samuthirakani
People Media Factory

More Telugu News