Maoist: 15 మందిని కిడ్నాప్ చేసి, ఇద్దరిని దారుణంగా హతమార్చిన మావోయిస్టులు

Maoists killed two persons

  • చత్తీస్ గఢ్ లో మావోయిస్టుల ఘాతుకం
  • ఉప సర్పంచ్ గంగ, టీచర్ సుక్కాలను దారుణంగా హతమార్చిన మావోలు
  • మావోయిస్టుల చెరలో 13 మంది

చత్తీస్ గఢ్ లో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరిని దారుణంగా హత్య చేశారు. సుక్మా జిల్లా బుర్కాపాల్ గ్రామ ఉప సర్పంచ్ మడవి గంగతో పాటు 15 మందిని మావోయిస్టులు నిన్న రాత్రి కిడ్నాప్ చేశారు. అనంతరం అటవీ ప్రాంతంలో ప్రజాకోర్టును నిర్వహించారు. ఆ తర్వాత ఉప సర్పంచ్ గంగ, టీచర్ సుక్కాను దారుణంగా హత్య చేశారు. మిగిలిన 13 మంది ఇంకా మావోయిస్టుల చెరలోనే ఉన్నారు. ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.  

Maoist
Chhattisgarh
Kidnap
Murder
  • Loading...

More Telugu News