Rajasthan: బక్రీద్ ఎఫెక్ట్.. రూ. కోటి ధర పలికిన పొట్టేలు! కానీ..

Rajasthan man refuses Rs 1 crore offer for lamb ahead of Eid

  • రాజస్థాన్‌లోని చూరూ జిల్లాలో వెలుగు చూసిన ఘటన
  • పొట్టేలు ఉదర భాగంలో ‘786’ సంఖ్యతో విపరీతంగా పెరిగిన డిమాండ్
  • కోటి ధర ఇస్తామన్నా అమ్మేందుకు సిద్ధంగా లేని గొర్రెల కాపరి
  • చిన్నప్పటి నుంచీ పెంచిన దాన్ని అమ్మేందుకు సిద్ధంగా లేనని వ్యాఖ్య

బక్రీద్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా గొర్రెలకు డిమాండ్ పెరిగింది. తాజాగా రాజస్థాన్‌లో చూరూ జిల్లాలో ఓ పొట్టేలు ఏకంగా రూ.కోటి ధర పలికింది. ముస్లింలు పవిత్రంగా భావించే ‘786’ సంఖ్య పొట్టేలు పొట్ట భాగంలో ఉండటంతో దీని ధర అమాంతం పెరిగిపోయింది. అయితే గొర్రెల కాపరి రాజు సింగ్ మాత్రం దీన్ని విక్రయించేందుకు ససేమిరా అంటున్నాడు. చిన్నప్పటి నుంచీ సాకుతున్న ఈ పొట్టేలును అమ్మేందుకు చేతులు రావట్లేదని చెప్పాడు. 

‘‘తొలుత ఆ సంఖ్య ప్రాముఖ్యత గురించి నాకు తెలీదు. ఆ తరువాత తెలిసిన వారిని సంప్రదిస్తే ఇది ముస్లింలకు పవిత్రమైన సంఖ్య అని తెలిసింది. కానీ, ఆ పొట్టేలంటే నాకు ఎంతో ఇష్టం. దాన్ని చూస్తూ చూస్తూ అమ్మలేకుండా ఉన్నాను’’ అని వ్యాఖ్యానించాడు. 

ప్రస్తుత పరిస్థితుల రీత్యా సింగ్ తన పొట్టేలుకు గట్టి భద్రత ఏర్పాట్లు కూడా చేశాడు. పుచ్చకాయలు, కాయగూరలు లాంటి పోషకాహారాన్ని ఇస్తున్నాడు. ‘‘గతేడాది ఇది పుట్టింది. అనేక మంది రూ.80 లక్షలు ఇచ్చేందుకు కూడా రెడీగా ఉన్నారు. కానీ నాకు అమ్మడం ఇష్టం లేదు’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఉదంతం దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది.

  • Loading...

More Telugu News