Kamal: 'ప్రాజెక్టు K'లో కమల్ ఆ సమయంలో ఎంట్రీ ఇస్తాడట!

Project K movie updatde

  • ప్రభాస్ హీరోగా రూపొందుతున్న 'ప్రాజెక్టు K'
  • పవర్ఫుల్ విలన్ పాత్రలో కమల్ 
  • క్లైమాక్స్ లో ఎంట్రీ ఇవ్వనున్న విలన్
  • 2024 సంక్రాంతికి ఫస్టు పార్టు రిలీజ్  

'ప్రాజెక్టు K'లో కమల్ విలన్ .. ఇప్పుడు అందరూ ఈ విషయాన్ని గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో విలన్ గా చేయడానికి కమల్ ఎంత పారితోషికం తీసుకుని ఉంటారు? ఆయన పాత్రను ఎలా డిజైన్ చేసి ఉంటారు? విలన్ గా ఆయన పాత్ర ఎంట్రీ ఏ సందర్భంలో ఉంటుంది? అనేవి ఆసక్తికరమైన అంశంగా మారింది. 

అయితే ఇతర విషయాలను గురించి అలా ఉంచితే, ఈ సినిమాలో ఆయన ఎంట్రీ ఈ సినిమా క్లైమాక్స్ లో ఉంటుందని తెలుస్తోంది. ప్రభాస్ - శ్రుతి హాసన్ జంటగా నటిస్తున్న ఈ సినిమా, మొదటి నుంచి చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగుతుందని అంటున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని రానున్నారని సమాచారం. 

సెకండ్ పార్టుపై అంచనాలు పెంచడం కోసమే ఫస్టు పార్టు చివరిలో కమల్ ఎంట్రీ ఇప్పించారనే టాక్ వినిపిస్తోంది. అంటే 'విక్రమ్' సినిమాలో సూర్య ఎంట్రీ మాదిరిగానన్న మాట. 'ప్రాజెక్టు K' పార్టు 1 ను 2024 జనవరిలో .. సెకండ్ పార్టును 2025 జనవరిలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. వైజయంతీ బ్యానర్ ఆపై నిర్మితమవుతున్న ఈ సినిమాకి, నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. 

Kamal
Prabhas
Deepika Padukone
Project K
  • Loading...

More Telugu News