Road Accident: హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురి దుర్మరణం

Four died in road accident

  • కారును ఢీకొట్టిన టిప్పర్
  • సంఘటన స్థలంలోనే మృతిచెందిన వ్యక్తులు
  • మృతుల్లో ఇద్దరు మహిళలు
  • మరణించినవారు వరంగల్ కాశీబుగ్గ సొసైటీకి చెందినవారిగా గుర్తింపు
  • సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వెళ్లి వస్తుండగా దుర్ఘటన

హన్మకొండ జిల్లాలో ఇవాళ రహదారి నెత్తురోడింది. ఆత్మకూరు, కటాక్షాపూర్ మధ్య ఓ కారును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. వారంతా ఘటన స్థలంలోనే మృతి చెందారు. కారులో సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. 

ఎదురుగా వేగంగా వస్తున్న టిప్పర్... కారును బలంగా ఢీకొట్టింది. దాంతో కారు నుజ్జునుజ్జయింది. డ్రైవర్, మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరణించినవారు వరంగల్ కాశీబుగ్గ సొసైటీకి చెందినవారిగా గుర్తించారు.

Road Accident
Death
Hanmakonda
Telangana
  • Loading...

More Telugu News