Uttam Kumar Reddy: బీఆర్ఎస్ లో చేరబోతున్నారనే వార్తలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందన

Uttam Kumar Reddy response on news joining BRS
  • కాంగ్రెస్ ను ఉత్తమ్ వీడుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం
  • తనపై అసత్య ప్రచారం చేస్తున్నారన్న ఉత్తమ్
  • దుష్ప్రచారం చేసేవారిని న్యాయపరంగా ఎదుర్కొంటానని వ్యాఖ్య
టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మారబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీలో ఆయన చేరబోతున్నారని చెపుతున్నారు. ఆయన భార్య పద్మావతి కూడా కారెక్కబోతున్నారని అంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులలో ఎవరో ఒకరికి ఎమ్మెల్యే టికెట్ వచ్చేలా చర్చలు జరుగుతున్నాయని చెపుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తమ్ స్పందించారు. పార్టీ మారుతున్నారనే వార్తలను ఆయన ఖండించారు. తాను కాంగ్రెస్ ను వీడుతున్నానంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని అన్నారు. దుష్ప్రచారం చేసేవారిని న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్పారు.
Uttam Kumar Reddy
Congress
BRS

More Telugu News