Ramcharan: మధ్యాహ్నం మీడియా ముందుకు రాంచరణ్-ఉపాసన

Ramcharan and Upasana will address media today

  • మూడు రోజలు క్రితం పాపకు జన్మనిచ్చిన ఉపాసన
  • నేటి మధ్యాహ్నం మీడియాతో మాట్లాడనున్న రాంచరణ్ దంపతులు
  • చిన్నారి ఫొటోలు రిలీజ్ చేసే అవకాశం

ఇటీవల తల్లిదండ్రులైన మెగా పవర్ స్టార్ రాంచరణ్-ఉపాసన దంపతులు ఈ మధ్యాహ్నం మీడియా ముందుకు రానున్నారు. ఈ నెల 20న పండంటి పాపకు జన్మనిచ్చిన ఉపాసన నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి బయటకు వచ్చిన తర్వాత మధ్యాహ్నం 1.30 గంటలకు రాంచరణ్ దంపతులు అపోలో ఆసుపత్రి వద్దనున్న నాగమ్మ ఆలయం వద్ద మీడియాతో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా తమకు శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ వారు కృతజ్ఞతలు తెలపనున్నారు. కాగా, మీడియా సమావేశంలో పాప ఫొటోలు విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.

Ramcharan
Upasana
Mega Power Star
Apollo Hospital
  • Loading...

More Telugu News