Deer herd: అడవిలో వాహనాలు నిదానంగా వెళ్లాలని చెప్పేది ఇందుకే.. వీడియో ఇదిగో!

Herd Of Deer Stampede Across The Road Jump Right On Top Of A car

  • అడవి మధ్యలో రహదారిపై వేగంగా వెళుతున్న కారు
  • ఒక్కసారిగా దూసుకువచ్చిన దుప్పుల గుంపు
  • రోడ్డు దాటే ప్రయత్నంలో అడ్డొచ్చిన కారు

అటవీ ప్రాంతంలో రహదారుల గుండా వాహనాలు తక్కువ వేగంగా వెళ్లాలనే బోర్డులు కనిపిస్తుంటాయి. కానీ, చాలా మంది దీన్ని పట్టించుకోరు. నిర్మానుష్య ప్రాంతం కావడంతో భయంతో ఎక్కువ మంది అతి వేగంగా వెళ్లే ప్రయత్నం చేస్తుంటారు. వేగంగా వెళ్లడం వల్ల అటవీ జంతులకు హాని కలుగుతుందన్న ఆందోళనతోనే నిదానంగా వెళ్లాలనే సూచికలను ఏర్పాటు చేస్తుంటారు.

ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, ఈ వీడియోని గమనిస్తే, ఖాళీగా ఉన్న రహదారిపై ఓ కారు రయ్యిమంటూ దూసుకుపోతోంది. ఒకవైపు నుంచి మరోవైపు రోడ్డును దాటేందుకు దుప్పులు ఒక్కసారిగా వరుసక్రమంలో పరుగు అందుకున్నాయి. అప్పటి వరకు రోడ్డు ఖాళీగా ఉండడంతో కారును డ్రైవర్ వేగంగా పోనిస్తున్నాడు. 

దుప్పులు ఒక్కసారిగా దూసుకురావడంతో అతడు కారును నియంత్రించే ప్రయత్నం చేశాడు. కానీ, ఈ లోపే దుప్పులు చెల్లాచెదురయ్యాయి. ఓ దుప్పి అయితే కారు డిక్కీపై చిక్కుకుని తర్వాత కిందకు దూకేసింది. దాని కాలుకి గాయం అయినట్టు తెలుస్తోంది. కుంటుతూ వెళ్లింది. కారు కూడా కొంత డ్యామేజ్ అయింది. వెనుక వస్తున్న కారులోని వ్యక్తి కెమెరాతో దీన్ని చిత్రీకరించారు. అందుకని అటవీ ప్రాంతంలో ఎవరైనా కొంత తక్కువ వేగంతో వెళ్లడం మంచిది. 

  • Loading...

More Telugu News