Junior NTR: పేరెంట్స్ క్లబ్ కు స్వాగతం: జూనియర్ ఎన్టీఆర్

Junior NTR congratulates Ramcharan and Upasana

  • తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన రామ్ చరణ్, ఉపాసన
  • శుభాకాంక్షలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్
  • కూతురుతో గడిపే ప్రతి క్షణం మధురమైన జ్ఞాపకమేనన్న తారక్

టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన నేపథ్యంలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చరణ్ ను సోదరుడిగా భావించే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. రామ్ చరణ్, ఉపాసనలకు కంగ్రాట్యులేషన్స్ అని ట్వీట్ చేశారు. పేరెంట్స్ క్లబ్ కు స్వాగతం పలికారు. కూతురుతో గడిపే ప్రతి క్షణం జీవిత కాలమంతా మరిచిపోలేని మధురమైన జ్ఞాపకమేనని చెప్పారు. చిన్నారికి, మీకు అంతులేని సంతోషాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.  

రామ్ చరణ్, ఎన్టీఆర్ కుటుంబాల మధ్య ఎంతో ఆత్మీయమైన అనుబంధం ఉంది. ఇద్దరూ సొంత అన్నాదమ్ముళ్ల మాదిరే మెలుగుతుంటారు. ఎవరింట్లో ఫంక్షన్ జరిగినా వీరు కలుసుకుంటుంటారు. తాజాగా చరణ్ తండ్రి కావడంతో ఎన్టీఆర్ తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ తెల్లవారుజామున ఉపాసన పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి కూడా ఆసుపత్రికి వెళ్లి తన మనవరాలిని చూసుకుని మురిసిపోయారు.

Junior NTR
Ramcharan
Upasana
Tollywood

More Telugu News