Kinjarapu Acchamnaidu: టీడీపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.. కానీ..: అచ్చెన్నాయుడు

atchennaidu comments on party leaders
  • తనతో సహా పార్టీ నేతలెవరూ పూర్తి స్థాయిలో పని చేయడం లేదన్న అచ్చెన్న
  • రానున్న రోజుల్లో ప్రజల్లో ఉండేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచన
  • చంద్రబాబుతో చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని హితవు
టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, కానీ తనతో సహా పార్టీ నేతలు ఎవరూ కూడా పూర్తి స్థాయిలో పని చేయడం లేదనే ఫీలింగ్ ఉందని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజల్లో ఉండేలా కార్యాచరణ రూపొందించుకోవాలని నేతలకు సూచించారు.

ఐదు జోన్లలో భవిష్యత్ గ్యారెంటీ అంశాలపై బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు. సీఎం జగన్ అప్పులు తెచ్చి అరకొర సంక్షేమం చేశారని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సంపద సృష్టించారని, పూర్తి సంక్షేమం చేశారని చెప్పారు.

దసరా పండుగ సందర్భంగా విడుదల చేసే టీడీపీ మేనిఫెస్టోలో ఉద్యోగులకు సంబంధించిన అంశాలుంటాయని అచ్చెన్న చెప్పారు. పార్టీ కార్యక్రమాలను, ప్రచార కార్యక్రమాలను నేతలు సీరియస్‌గా తీసుకోవాలని ఆయన కోరారు. చంద్రబాబుతో చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని హితవు పలికారు.
Kinjarapu Acchamnaidu
Chandrababu
TDP
Jagan
YSRCP

More Telugu News