Kajal Agarwal: 'సత్యభామ'గా పవర్ ఫుల్ పాత్రలో ఆసక్తిని రేపుతున్న కాజల్!

Sathyabhama movie update

  • తెలుగు తెర చందమామ గా కాజల్ కి పేరు 
  • తెలుగు .. తమిళ భాషల్లో ఇప్పటికీ తగ్గని జోరు 
  • 'సత్యభామ'గా స్టైలీష్ లుక్ తో మార్కులు కొట్టేస్తున్న బ్యూటీ
  • క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ  
  • దర్శకుడిగా డేగల పరిచయం

వెండితెరపై సుదీర్ఘకాలంగా స్టార్ హీరోయిన్స్ గా చక్రం తిప్పుతూ వచ్చిన సీనియర్ కథానాయికలలో, అనుష్క .. నయనతార .. త్రిష .. శ్రియ కనిపిస్తూ వచ్చారు. వీరితో పాటు బరిలో ఉన్న కాజల్, అందాల చందమామగా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆమె 60వ సినిమాగా 'సత్యభామ' రూపొందుతోంది. 

కాజల్ ఇంతవరకూ ఎక్కువగా స్టార్ హీరోల సరసన నాయికగా ఆడిపాడుతూ వచ్చింది. అయితే లేడీ ఓరియెంటెడ్ సినిమాల పట్ల ఆమె ఎక్కువగా దృష్టిపెట్టలేదనే విషయం ఆమె కెరియర్ చూస్తే అర్థమవుతుంది. కథాభారాన్ని భుజాన వేసుకుని, ఒక సినిమా జయాపజయాలను ఆమె మోసిన సందర్భాలు దాదాపు లేవనే చెప్పాలి. 

అలాంటి కాజల్ ఇప్పుడు 'సత్యభామ' సినిమాను చేస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను, శ్రీనివాసరావు .. బాబీ తిక్క నిర్మిస్తున్నారు. శశికిరణ్ తిక్క స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి, అఖిల్ డేగల దర్శకత్వం వహించాడు. స్టైలీష్ లుక్ తో ఆకట్టుకుంటున్న కాజల్, ఈ సినిమాతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బిజీ అవుతుందేమో చూడాలి.

Kajal Agarwal
Akhil Degala
Sathyabhama Movie
  • Loading...

More Telugu News