Pawan Kalyan: మేం రాజకీయాల్లోకి రాకముందే మా కుటుంబాన్ని టార్గెట్ చేసినట్టు తెలిసింది: పవన్ కల్యాణ్

Pawan Kalyan held meeting with Janasena leaders

  • కాకినాడ జిల్లాలో వారాహి యాత్ర
  • జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం
  • గతంలో తనకు అపెండిక్స్ ఆపరేషన్ జరిగిందని వెల్లడి
  • పరామర్శించేందుకు ఓ ఐపీఎస్ అధికారి వచ్చారన్న పవన్
  • తమ కుటుంబాన్ని టార్గెట్ చేసిన విషయం ఆయన ద్వారానే తెలిసిందన్న జనసేనాని

కాకినాడ జిల్లాలో వారాహి యాత్ర సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన ఆసక్తికర అంశం వెల్లడించారు. గతంలో తనకు అపెండిక్స్ ఆపరేషన్ జరిగిందని, పరామర్శించేందుకు ఓ ఐపీఎస్ అధికారి వచ్చారని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆయన ఇప్పటికీ ఎక్కడో సర్వీసులోనే ఉన్నట్టు చెప్పారు. ఆయన తీరు చూస్తే ఏదో విషయం చెప్పాలనుకుంటున్నట్టుగా అనిపించిందని పేర్కొన్నారు. 

"ఆ ఐపీఎస్ అధికారి నా వద్దకు వచ్చారు. మీకు విషయం చెబుదామనుకుంటున్నాను అన్నారు. ఏంటండీ అది అన్నాను. మీరు గానీ, మీ ఫ్యామిలీలో ఎవరైనా గానీ రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన ఉందా? అని అడిగారు. అప్పటివరకు మాకు రాజకీయ పార్టీ గురించి ఆలోచనే లేదు. లేదండీ... మాకు అలాంటి ఆలోచనేమీ లేదు అని చెప్పాను. ఎందుకలా అడుగుతున్నారు అని ఆ ఐపీఎస్ అధికారిని అడిగాను. దాంతో ఆయన... వాళ్లు మీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పారు. నిన్ను, మీ అన్నయ్య గారి పిల్లలను టార్గెట్ చేస్తున్నారు అని వెల్లడించారు" అంటూ పవన్ నాటి ఘటనను వివరించారు.

Pawan Kalyan
Janasena
Varahi Yatra
Kakinada District
  • Loading...

More Telugu News