JEE Advanced 2023: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల వెల్లడి.. ‘టాప్’ లేపిన హైదరాబాద్ కుర్రాడు
- కామన్ ర్యాంక్ లిస్టులో టాపర్‌గా చిద్విలాస్‌రెడ్డి
- 360 మార్కులకు గాను 341 మార్కులు
- అమ్మాయిల్లో నాగభవ్యశ్రీ టాప్
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2023 ఫలితాలు వచ్చేశాయి. ఉదయం 10 గంటలకు విడుదలైన ఈ ఫలితాల్లో హైదరాబాద్ కుర్రాడు వావిలాల చిద్విలాస్‌రెడ్డి కామన్‌ర్యాంక్ లిస్టులో ఫస్ట్ ర్యాంకర్‌గా నిలిచాడు. ఐఐటీ హైదరాబాద్ జోన్‌కు చెందిన చిద్విలాస్ 360 మార్కులకు గాను 341 మార్కులు స్కోర్ చేశాడు.
అమ్మాయిల్లో నాయకంటి నాగభవ్యశ్రీ 360 మార్కులకుగాను 298 మార్కులతో టాపర్‌గా నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఈసారి నెగటివ్ మార్కింగ్ ప్రశ్నలు తక్కువగా ఉండడంతో పరీక్షల్లో ఎక్కువ కటాఫ్‌కు అవకాశం లభించిందని నిపుణులు ఇప్పటికే స్పష్టం చేశారు.