Prabhas: ప్రపంచవ్యాప్తంగా కొత్త రికార్డును నమోదు చేసిన 'ఆదిపురుష్'

Adipurush movie update

  • పాన్ ఇండియా `స్థాయిలో వచ్చిన 'ఆదిపురుష్'
  • సీతారాములుగా ప్రభాస్ - కృతి సనన్ 
  • వరల్డ్ వైడ్ గా తొలిరోజున 140 కోట్ల వసూళ్లు
  • వీకెండ్ లో 300 కోట్ల మార్క్ ను టచ్ చేసే ఛాన్స్

రామాయణం కథను దర్శకుడు ఓమ్ రౌత్ 'ఆదిపురుష్' గా తెరపై ఆవిష్కరించాడు. ప్రభాస్ కథానాయకుడిగా ఈ సినిమా రూపొందింది. శ్రీరాముడిగా ప్రభాస్ .. సీతాదేవిగా కృతి సనన్ .. హనుమంతుడిగా దేవ్ దత్త .. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషించారు.
 
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా నిన్ననే థియేటర్లకు వచ్చింది. వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 7 వేల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, తొలిరోజున 140 కోట్లను వసూలు చేసింది. ఇప్పటికే ఈ సినిమా కొన్ని బాలీవుడ్ సినిమాల రికార్డులను అధిగమించింది. శని .. ఆదివారాల్లో ఈ సినిమా 300 కోట్ల మార్కును టచ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు.

రాముడిగా ప్రభాస్ .. సీతాదేవిగా కృతి సనన్ .. హనుమంతుడిగా దేవ్ దత్త తమ పాత్రలకి న్యాయం చేశారు. రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటన కూడా ఓకే. కాకపోతే ఆయన పాత్ర విషయంలో చేసిన మార్పుల వలన, ఆయన కనెక్ట్ కాలేకపోయారు. ఎలాంటి మార్పులు చేయకుండా ఈ సినిమాను తీసి ఉంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Prabhas
Kruthi Sanan
Saif Alikhan
Adipurush
  • Loading...

More Telugu News