anand mahindra: వినూత్న వ్యాపారం చేస్తున్నారా..? అయితే, ట్విట్టర్ లో స్పందించండి: ఆనంద్ మహీంద్రా

anand mahindra taken special initiative to promote smse enterprisebharat

  • ఒక్కో సూక్ష్మ పరిశ్రమకు రూ.25 లక్షల చొప్పున పెట్టుబడి
  • వ్యాపారం వినూత్నమైనదిగా ఉండాలన్న షరతు
  • తమకు తెలిసిన వ్యాపారం గురించి పంచుకోవాలని పిలుపు

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో తనను అనుసరించే కోటి మందికి ఓ పిలుపునిచ్చారు. ఎవరో ఒకరు సమాజానికి శ్రద్ధగా సేవ చేస్తున్నారా? వారి స్టోరీని ట్విట్టర్ లో ఒక ట్వీట్ ద్వారా పంచుకోండి. ఫొటో, వీడియోని జోడించండి. ఎంపిక చేసిన వారిని నా సహచరులు సంప్రదిస్తారు’’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ పోస్ట్ చేశారు. 

దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న సూక్ష్మ పరిశ్రమలకు సాయంగా నిలబడాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. అమెరికాలోనూ 90 శాతం కొత్త వ్యాపారాలు మామ్ అండ్ పాప్ షాప్ లేనని, 67 శాతం ఉద్యోగాలు అవే కల్పిస్తున్నట్టు చెప్పారు. కేంద్ర బడ్జెట్ లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) పట్ల ప్రత్యేక దృష్టి పెట్టినందున, ప్రైవేటు రంగం కూడా ముందుకు వచ్చి ఈ రంగానికి మద్దతుగా నిలవాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.

అందుకే తాను ఎంటర్ ప్రైజ్ భారత్ పేరుతో కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నట్టు ఆనంద్ మహీంద్రా ప్రకటించారు. ఇందుకోసం రూ.10 కోట్ల నిధిని కేటాయిస్తున్నానని, అర్హత కలిగిన సూక్ష్మ పరిశ్రమ ఒక్కో దానికి రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కావాల్సిన అర్హతల వివరాలు, ఆ వివరాలను ఎలా పంచుకోవాలనేది ట్విట్టర్ పేజీలో పేర్కొన్నారు. 

ఎవరైనా కానీ తమకు తెలిసిన వినూత్నమైన చిన్న వ్యాపారం గురించి తెలియజేయవచ్చు. హ్యాష్ ట్యాగ్ ఎంటర్ ప్రైజ్ భారత్ అని టైప్ చేసి పోస్ట్ చేయాలి. సదరు వ్యాపారం ఎందుకు వినూత్నమైనది, కొత్తదనంతో కూడినదో వివరించాలి. ఎంపిక చేసిన వారికి మరిన్ని వివరాలు కోరుతూ రిప్లయ్ వస్తుంది. తుదిగా ఎంపికైన సంస్థకు రూ.25 లక్షలు పెట్టుబడి సాయంగా అందుతుంది.

More Telugu News