BJP Leader: 400 కార్లలో అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరిన మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే.. వీడియో ఇదిగో!

BJP Leader Heads To Congress In 400 Car Convoy
  • సొంతగూటికి చేరిన శివపురి ఎమ్మెల్యే బైజ్ నాథ్  
  • సింధియాతో కలిసి 2020 లో పార్టీ మారిన బైజ్ నాథ్
  • బీజేపీలో టికెట్ రాదని నిర్ధారించుకుని పార్టీ మార్పు  
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన ఓ ఎమ్మెల్యే ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.. సొంతగూటిలో చేరేందుకు ఏకంగా 400 కార్ల భారీ కాన్వాయ్ తో ర్యాలీగా రావడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ భారీ కాన్వాయ్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. మధ్యప్రదేశ్ లోని శివపురి ఎమ్మెల్యే బైజ్ నాథ్ 2020 లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరారు. జ్యోతిరాధిత్య సింధియాతో కలిసి పార్టీ మారిన నేతల్లో ఈయన కూడా ఉన్నారు. బీజేపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

అయితే, వచ్చే ఎన్నికల్లో శివపురి టికెట్ తనకు దక్కే సూచనలు కనిపించడంలేదని, లాబీయింగ్ చేసినా ఉపయోగం లేదని తేలిపోవడంతో బైజ్ నాథ్ పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు కాంగ్రెస్ నేతలతో జరిపిన చర్చలు ఫలించడంతో తిరిగి సొంతగూటికి వెళ్లనున్నట్లు బైజ్ నాథ్ ప్రకటించారు. కాంగ్రెస్ లో చేరిక సందర్భంగా ఎమ్మెల్యే బలప్రదర్శన చేపట్టారు. ఏకంగా 400 కార్లతో కాన్వాయ్ ఏర్పాటు చేసుకుని, శివపురి నుంచి భోపాల్ ప్రయాణించారు. ఈ ర్యాలీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
BJP Leader
Congress
400 car convoy
baijnath
sindia
Madhya Pradesh
shivpuri

More Telugu News