Kolkata: కోల్ కతా అంతర్జాతీయ విమానాశ్రయంలో అగ్నిప్రమాదం

Fire accident in Kolkata airport

  • నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో స్వల్ప అగ్నిప్రమాదం
  • ప్రమాదం కారణంగా కాసేపు నిలిచిపోయిన చెకిన్ ప్రాసెస్
  • షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమిక అంచనా

కోల్ కతా లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో నిన్న రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. విమానాశ్రయంలోని చెకిన్ ఏరియా పోర్టల్-డీ వద్ద స్వల్పంగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు మంటలను ఆర్పేశారు. అగ్నిప్రమాదం, పొగ వ్యాపించడం కారణంగా కాసేపు చెకిన్ ప్రాసెస్ ను అధికారులు ఆపేశారు. 

ఈ ప్రమాదంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందిస్తూ... చెకిన్ కౌంటర్ వద్ద దురదృష్టకర ఘటన చోటుచేసుకుందని, అయితే, అది స్వల్ప అగ్నిప్రమాదమేనని చెప్పారు. తాను విమానాశ్రయం డైరెక్టర్ తో మాట్లాడానని... పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. ప్రమాద స్థలం నుంచి ప్రయాణికులను సురక్షిత ప్రదేశానికి తరలించినట్టు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఏమిటో తెలుసుకుంటామని చెప్పారు. మరోవైపు, షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

Kolkata
Airport
Fire Accident
  • Loading...

More Telugu News