Johnny Depp: భార్య చెల్లించిన పరిహారాన్ని దానం చేస్తున్న జానీ డెప్

Johnny Depp donates all of ex wife Amber Heard1 million dollars settlement money to charity

  • 2 మిలియన్ డాలర్లను ఇవ్వాలని నిర్ణయించుకున్న డెప్
  • 2 లక్షల  డాలర్ల చొప్పున ఐదు సంస్థలకు కేటాయింపు
  • ప్రాణాంతక వ్యాధులతో బాధపడే వారికి సాయం

హాలీవుడ్ నటుడు జానీడెప్ తన మాజీ భార్య అంబర్ హెర్డ్ తనకు చెల్లించిన పరిహారం నుంచి మిలియన్ డాలర్లను సామాజిక కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చేయాలని నిర్ణయించాడు. కోర్టులో హెర్డ్ పై డెప్ విజయం సాధించడం తెలిసిందే. 2 మిలియన్ డాలర్లను (రూ.8 కోట్లు) మొత్తం ఐదు స్వచ్ఛంద సంస్ధలకు ఇవ్వనున్నాడు. ఒక్కో చారిటీకి 2 లక్షల డాలర్ల చొప్పున పంచనున్నాడు. అనారోగ్యంతో బాధపడే చిన్నారులకు, బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణానికి ఇలా ఐదు సేవా కార్యక్రమాలకు ఆ మొత్తాన్ని వెచ్చించనున్నాడు. 

మేక్ ఏ ఫిల్మ్ ఫౌండేషన్, ద పెయింటెడ్ టర్టిల్, రెడ్ ఫెదర్, మార్లన్ బ్రాండోస్ కు చెందిన టెటిరో సొసైటీ చారిటీ, అమెజానియా ఫండ్ అలియన్స్ ను జానీ డెప్ ఎంపిక చేసుకున్నాడు. ఈ ఐదు సంస్థలకు 2 లక్షల డాలర్ల చొప్పున ఇవ్వనున్నాడు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడే దర్శకులు, రచయితలు, నిర్మాతలు, వారి పిల్లలకు కూడా ఈ విరాళం అందనుంది. అంబర్ హెర్డ్, జానీ డెప్ ఒకరిపై ఒకరు న్యాయపోరాటానికి దిగడం తెలిసిందే. 

జానీ డెప్ డ్రగ్స్, ఆల్కహాల్ ప్రభావానికి గురైన సమయంలో తనను శారీరకంగా వేధించినట్టు ఆమె ఆరోపించింది. హెర్డ్ కు వ్యతిరేకంగా జానీ డెప్ 50 మిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేశాడు. ఇద్దరికీ అనుకూలంగా, వ్యతిరేకంగా కోర్టు తీర్పులు వెలువరించింది. డెప్ కు 10 మిలియన్ డాలర్లు చెల్లించాలని హెర్డ్ ను ఆదేశించగా, హెర్డ్ కు 2 మిలియన్ డాలర్లు చెల్లించాలని జానీ డెప్ నకు కోర్టు ఆదేశించింది.

  • Loading...

More Telugu News